టాలీవుడ్ లో కోటి రెమ్యున‌రేష‌న్‌ తీసుకున్న మొట్టమొదటి స్టార్ బ్యూటీ ఎవ‌రంటే.. ?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మార్కెట్ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నవారంతా వందల‌ కోట్లలో రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు. కేవలం హీరోలే కాదు.. హీరోయిన్లు కూడా నిర్మాతల దగ్గర బానే రెమ్యూనరేషన్లు ఛార్జ్ చేస్తున్నారు. మంచి ఫామ్ లో ఉన్న టాప్ హీరోయిన్లైతే రూ.5 నుంచి ఏకంగా రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్లు డిమాండ్ చేస్తున్నారు. కుర్ర హీరోయిన్లు కోటి రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో తెలుగులో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న మొదటి హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది.

Ileana D'Cruz: Getting into uncertain sphere pushes me to do better

అయితే చాలామంది దివంగత అతిలోక‌సుందరి శ్రీదేవి అని అనుకుంటారు. కానీ.. మొదట తెలుగులో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ శ్రీదేవి కాదట. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి కోటి రూపాయలు ఛార్జ్ చేసిన హీరోయిన్ శ్రీదేవినే. కానీ.. తెలుగులో ఫ‌స్ట్ టైం కోటి రూపాయలు తీసుకున్న హీరోయిన్ మాత్రం నాజుకు నడుముసుందరి ఇలియానా అని తెలుస్తుంది. 2006లో దేవదాస్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఇలియానా.. ఫస్ట్ మూవీ తోనే సక్సెస్ అందుకుంది. అదే ఏడది.. మహేష్ బాబుతో పోకిరి సినిమా నటించి ఇండ‌స్ట్రియ‌ల్ హిట్ త‌న ఖాతాలో వేసుకుంది.

Khatarnak Telugu Movie Review Ravi Teja Ileana Amma Rajasekhar

రెండో సినిమాకే స్టార్ట్ బ్యూటీగా ఇమేజ్‌ సొంతం చేసుకుని ఆఫర్లను అందుకుంది. జీరో సైజ్ కారణంగా ఆమెకు మరింత క్రేజ్ ఏర్పడింది. సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలో ఇలియానా తన మూడో సినిమా కథల కోసం ఏకంగా కోటి రూపాయల డిమాండ్ చేసిందట‌. దీంతో మొదట ప్రొడ్యూసర్లు షాక్ అయినా.. ఇలియానా క్రేజ్‌ దృష్టిలో ఉంచుకొని కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారు. అయితే రవితేజ, ఇలియానా జంటగా నటించిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అయినా ఇలియానా క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. తర్వాత వరుస సినిమాల్లో నటించి తన పాపులారిటీ మరింతగా పెంచుకుంది.