తెలీదు.. అనుకోలేదు.. తప్పు జరిగింది.. తొక్కిస‌లాట ఘటనపై బన్నీ రియాక్షన్ ఇదే.. !

సంధ్య‌ థియేటర్ తొక్కిసలాట ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 బెనిఫిట్‌షో స‌మ‌యంలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెంట‌నే మ‌ధ్య‌స్థ‌ర బెయిల్‌తో రిలీజ్ అయిన అల్లు అర్జున్.. తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యాడు. బెనిఫిట్ షోపై విచారణలో అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ థియేటర్ యాజమాన్యం నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని.. ప్రీమియర్ షోల సమయంలో తొక్కిస‌లాట జరిగిందని తాను అనుకోలేదని.. తన ప్రేమేయం లేకుండా.. తప్పిదం జరిగిందంటూ ఒప్పుకున్నాడు.

చిక్కడపల్లి పోలీసుల ముందు మంగళవారం అల్లు అర్జున్ కన్ఫెషన్ స్టేట్మెంట్ చేశారు. 24 – 12 -24 మంగళవారం ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 2:45 గంటల వరకు విచారణ కొనసాగింది. ఏకంగా 3 గంటల 35 నిమిషాల పాటు జరిగిన ఈ విచారణలో.. చిక్కడపల్లి ఎస్పీ రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ రాజ్ నాయక్ సహా మొత్తం 8 మంది పోలీస్ సభ్యులతో కూడిన స్పెషల్ టీం అల్లు అర్జున్‌ను ప్రశ్నించారు. బెనిఫిట్‌షోల‌కు సెలబ్రిటీల అనుమతి నిరాకరిస్తూ.. ఈనెల 3న పోలీసులు ఇష్యూ చేసిన లెటర్ ను అల్లు అర్జున్ ముందు పెట్టి ప్రశ్నలను సంధించారు.

ఈ విచారణ అంతా న్యాయవాది సమక్షంలో వీడియో రికార్డ్ చేస్తూ పూర్తి చేశారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేశారు. ఎఫ్ ఐ ఆర్ రిమాండ్.. కేస్ డైరీలో పేర్కొన్న అంశాలు బేస్ పై.. దాదాపు 23 ప్రశ్నలు అడగగా.. పోలీసులు అడిగిన ప్రశ్నలలో 15 ప్రశ్నలకు మాత్రమే అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. మిగతా ఎనిమిది ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదట. అప్పర్ బాల్కనీలోకి వెళ్ళిన తర్వాత థియేటర్లో చీకటి, భారీ సౌండ్స్, అభిమానుల సందడిలో బయట ఏం జరిగిందో అసలు నాకు తెలియలేదని.. ప్రశ్న దాటేసినట్లు సమాచారం.