టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి.. ప్రస్తుతం ఏ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నాడు తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో నెంబర్ వన్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న జక్కన్న.. చివరగా ఎన్టీఆర్, చరణ్ కాంబోలో తర్కెక్కించిన ఆర్‌ఆర్ఆర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో.. ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు రాజమౌళి.
ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే.. ఆడియన్స్‌లో విపరీతమైన అంశాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. రాజమౌళికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. గతంలో రాజమౌళి, నాగార్జున కాంబోలో ఓ సినిమా ఫిక్స్ అయిన తర్వాత ఆగిపోయిందట. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు మర్యాద రామన్న. ఈ సినిమాల్లో టాలీవుడ్ స్టార్ కమెడియన్ సునీల్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
సలోని హీరోయిన్గా కనిపించింది. మొదట రాజమౌళి.. నాగార్జునని ఈ మూవీలో హీరోగా అనుకున్నాడట. కానీ.. కొన్ని కారణాలతో నాగార్జున సినిమాని రిజెక్ట్ చేశాడని.. దీంతో సునీల్ ఖాతాలోకి ఈ సినిమా వెళ్లినట్లు తెలుస్తుంది. అలా.. నాగార్జున, రాజమౌళి కాంబోలో రావలసిన మర్యాదరామన్న సునీల్ హీరోగా తరకెక్కి మంచి సక్సెస్ అందుకుంది. కాగా ఈ సినిమాలో నాగార్జున నటించి ఉంటే మాత్రం ఆయన కెరియర్ లోనే ఇదో స్పెషల్ సినిమాగా నిలిచిపోయేది అనటంలో అతిశయోక్తి లేదు.