స్నేహారెడ్డికి కోపం తెప్పించిన బన్నీ ఫ్యాన్స్.. పబ్లిక్ లో అలాంటి పనితో ప‌రువు పాయే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సు కుమార్ కాంబోలో వ‌చ్చిన‌ నాలుగవ‌ మూవీ పుష్ప 2. ఈ మూవీ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో మోస్ట్ ఎవైటెడ్‌గా.. ఆడియన్స్ అంత ఎదురు చేసిన ఈ సినిమా.. రిలీజ్ అయిన తర్వాత కూడా అదే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ టాక్‌ సంపాదించుకుంది. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడమే కాదు.. పుష్పరాజ్ మ్యానరిజం మరోసారి ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్‌తో రికార్డులు సృష్టించాడు బన్నీ. డిసెంబర్ 5న రిలీజ్ అయిన సినిమాకు.. డిసెంబర్ 4 నుంచి బెనిఫిట్స్ లో పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4 రాత్రి 9:30 గంటల నుంచి బెనిఫిట్ షోలో ప్రారంభమయ్యాయి.

Allu Arjun wins hearts with his protective gesture for wife Sneha Reddy amid 'Pushpa 2' promotions | - Times of India

ఇందులో భాగంగానే అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి అలాగే హీరోయిన్ రష్మిక మందన‌తో కలిసి హైదరాబాద్ సంధ్య థియేటర్ లో సినిమా వీక్షించేందుకు వెళ్ళారు. ఇలాంటి క్రమంలో.. బన్నీ ఫ్యాన్స్ చేసిన పని స్నేహ రెడ్డికి కోపం తెప్పించింది. పబ్లిక్ లో వారు చేసిన పనితో స్నేహ రెడ్డి చాలా ఇబ్బంది పడిందట. ఇంతకీ అసలు ఏం జరిగిందో.. ఒకసారి తెలుసుకుందాం. స్నేహ రెడ్డి, అల్లు అర్జున్‌ల‌ది లవ్ మ్యారేజ్ అన్న సంగతి తెలిసిందే. వీరు పెళ్లి ఇంత కాలమైనా ఇప్పటికే ఎంతో అన్యాయంగా ఉంటా అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక స్నేహ రెడ్డి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.

ఆమె చాలా హుందాతనంగా మెలుగుతూ.. ఎవరి జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇక తన జోలికి వస్తే మాత్రం ఆమె అసలు సహించద‌ని చెబుతూ ఉంటారు. కాగా తాజాగా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, రష్మిక కలిసి పుష్ప 2 సినిమాను సంధ్య థియేటర్లో వీక్షించాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలు కలిసి సినిమాకి వెళ్తుంటే మధ్యలో రష్మిక ఎందుకు అంటూ.. పానకంలో పుడకలా నువ్వెందుకు తల్లి అంటూ.. పలు రకాలుగా ట్రోల్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో హీరోయిన్ కాబట్టి తాను కూడా వెళ్ళింది అంటూ రష్మికకు కొంతమంది సపోర్ట్ గా నిలిచారు. ఇక సినిమా చూసి.. ముగ్గురు కలిసి బయటకు వస్తున్న టైం లో బన్నీ ఫ్యాన్స్ చేసిన చెత్త పని వల్ల స్నేహ రెడ్డికి విపరీతమైన కోపం వచ్చేసిందట. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ కూడా నెటింట వైరల్‌గా మారుతున్నాయి.

రష్మిక, బ‌న్నీ మధ్యన సినిమాల్లో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయిందో చూసాం. ఇద్దరు రొమాంటిక్ సీన్స్ లో తగ్గేదేలే అంటూ ఒకరితో ఒకరు పోటీ పడి మరీ నటించారు. ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ పెయిర్ అనే అంతలా వేరు ఇమేజ్లో క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే బన్నీ స్నేహ రష్మిక ముగ్గురు కలిసి బయటకు వస్తున్న టైం లో కొంతమంది బన్నీ అభిమానులు.. బన్నీ, రష్మిక సూపర్ జోడి అంటూ అరవడం మొదలు పెట్టారట. దీంతో స్నేహ రెడ్డికి చాలా కోపం వచ్చిందని.. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూస్తే అర్థమవుతుంది. కానీ.. ఆమె ఎక్కడ బయటపడకుండా.. హుందా తనం చూపించింది. కానీ వాళ్ళు బన్నీ, రష్మిక సూపర్ పెయిర్‌ అనేకంటే.. పుష్పరాజ్, శ్రీవల్లి బ్లాక్ బస్టర్ పెయిర్‌ అని ఉంటే బాగుండేది.. కానీ, రష్మిక, బన్నీ అంటూ అరవడంతో స్నేహ రెడ్డికి బాగా కోపం వచ్చేసిందట. కావలని కొంతమంది అభిమానులు స్నేహారెడ్డిని ఉడికించేందుకు అలా కామెంట్స్ చేశారని సమాచారం.