తండేల్ మూవీపై అల్లు అర్జున్ ఎఫెక్ట్.. అక్కినేని ఫ్యాన్స్ కు నయా టెన్షన్..!

అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో చైతన్యకు సరైన సక్స‌స్ లేదు. ఈ క్రమంలోనే.. అభిమానులు ఆయన నెక్స్ట్ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. తండేల్‌ సినిమా నాగచైతన్యకు భారీ సక్సెస్ అందిస్తుందని ఆశ భావంను వ్యక్తం చేస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై.. ఈ సినిమాను 2025 సంక్రాంతి బ‌రిలో ఫిబ్రవరి 7న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇలాంటి క్రమంలో బన్నీ వివాదం ప్రభావం తండేల్‌ సినిమాపై పడబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Allu Arjun Did Not Exit Theatre Despite Being Informed About Woman's Death:  Hyderabad Police

ఇంతకీ బన్నీ వివాదానికి.. తండేల్‌ సినిమాకు లింక్ ఏంటి అనుకుంటున్నారా.. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత తండేల్‌ ప్రొడ్యూసర్ అయినా అల్లు అరవింద్.. ప్రమోషన్ల విషయంపై పెద్దగా కాన్సన్ట్రేట్ చేయడం లేదు. ఈ క్రమంలోనే తండేల్ సినిమా పై జ‌నాల్లో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. అభిమన్యుల సైతం సినిమా నుంచి ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక.. నాగ చైతన్య స‌ర‌స‌న ఈ సినిమాలో సాయి పల్లవి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లిమిటెడ్ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్న సాయి పల్లవి.. ఈ ఏడాది అమరాన్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుని భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది.

Geetha Arts (@geethaarts) • Instagram photos and videos

ఈ సినిమాలో మ్యాజిక్ సాయి పల్లవి నెక్స్ట్ సినిమాలు కూడా రిపీట్ చేస్తాయో.. లేదో.. వేచి చూడాలి. అయితే సినిమాల్లో ఇప్పటివరకు రివిల్ అయిన అమ్మడి లుక్స్ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక సాయి పల్లవి ప్రస్తుతం ఒక్క సినిమాకు రూ.2 నుంచి రూ.3 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. ఇలాంటి క్రమంలో తండెల్ ప్రమోషన్స్ పై మేకర్స్ కాన్సెంట్రేట్ చేసి సినిమా మరింత హైప్‌ తీసుకురావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాతో చైతన్య బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కావాలంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.