నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్‌కు తెలుగునాడ ఉన్న ప్రజాదారణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలోనే కాదు రాజకీయాల్లోనూ తిరుగులేని పాపులారిటి దక్కించుకున్న ఎన్టీఆర్.. లక్షల మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఆయనతోపాటు ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎంతోమంది నటీ నటులను.. ఎన్టీఆర్ ప్రోత్సహిస్తూ ఉండేవారు. అలాంటి వారిలోనే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఒకరు. విజయశాంతిని అన్నగారు మొదటి నుంచి చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చేవారట.
అలా అప్పట్లో విజయశాంతి నటించిన ఓ సినిమాను ఒకటికి రెండుసార్లు ఎన్టీఆర్ చూశారని.. ఆ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇంతకీ విజయశాంతి నటించిన ఆ సినిమా ఏంటో.. ఎందుకంత స్పెషల్ ఒకసారి తెలుసుకుందాం. సీనియర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లో రెండు సార్లు చూసిన ఒకే ఒక్క సినిమా విజయశాంతి నటించిన ప్రతిఘటననేనట. ఈ సినిమాకు ఎన్టీఆర్ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక విజయశాంతి సత్యం శివం సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు చెల్లెలుగా విజయశాంతి ఆకట్టుకుంది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య అనుబంధం ఉండేదట.
ఆమె ఇంటి నుంచి పంపిన లంచ్ బాక్స్ ఎన్టీఆర్ తినడం. విజయశాంతి ఎక్కడ కలిసిన ఆమెకు మంచి ఆదిత్య ఇవ్వడం.. లాంటిది జరుగుతూ ఉండేవట. ప్రతిఘటన సినిమా కుల వివక్ష.. అన్నగారిన వర్గాల దుస్థితి.. సామాజిక సమస్యల చుట్టూ జరిగే పోరాటాల గురించి తెరకెక్కింది. అంతే కాదు రాజకీయ భావజాలానికి దగ్గరగా ఉంటుంది. ఇక సమానత్వం కోసం అంతా పోరాడాలని సామాజిక అంశంతో.. సినిమా రూపొందింది. అయితే ఈ సినిమాను చూసిన వెంటనే ఎన్టీఆర్‌కు బాగా నచ్చేసిందట. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా 1985లో తెరకెక్కింది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న టైంలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది. ఇక సినిమాలో విజయశాంతి అద్భుత నటనకు.. బెస్ట్ యాక్ట్రెస్ నంది అవార్డును కూడా దక్కించుకుంది. స్వయంగా ఈ అవార్డును ఎన్టీఆర్.. విజయశాంతికి అందించడం విశేషం.