‘ గేమ్‌ఛేంజ‌ర్ ‘ వ‌ర్సెస్ ‘ ఎన్బీకే 109 ‘… బాల‌య్య, దిల్ రాజు అంతు చూసే వ‌ర‌కు వ‌ద‌ల‌డా..?

సంక్రాంతి సీజన్ వచ్చిందంటే టాలీవుడ్ సినిమాల సందడి మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేయాలని హీరోస్ అంతా ఆరాటపడుతూ ఉంటారు. అలా ఈ ఏడది సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గేమ్ ఛేంజ‌ర్‌ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతోపాటే వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో మరో సినిమా రానుంది. ఈ రెండు సినిమాలపై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. అయితే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఈ సినిమాల రెండింటికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కనుక నైజం ప్రాంతంలో ఈ రెండు సినిమాలకు థియేటర్లలోటు ఉండదు. కాగా బాలయ్య 109వ‌ సినిమా కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటివరకు టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడం గమనార్హం.

Game Changer (film) - Wikipedia

ఇదిలా ఉంటే బాల‌య్య‌తో ఓ సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నా.. అవి వర్కౌట్ కావడం లేదు. బాలకృష్ణ గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడం లేదు. అలా అని నో కూడా చెప్పడం లేదు. దాని వెనుక ఒక కారణం ఉందట. బాలయ్య 100వ‌ సినిమాగా వ‌చ్చిన‌ గౌతమీపుత్ర శాతకర్ణి థియేటర్లలో క‌లెక్ష‌న్‌ మంచిగా రాబడుతూ.. విజయవంతంగా రన్ అవుతున్న టైం లో దిల్‌రాజు ఈ సినిమాను థియేటర్ల నుంచి హఠాత్తుగా తీసి.. వేరే సినిమాలు రిలీజ్ చేశారు. అప్పటినుంచి బాలయ్య.. దిల్‌రాజును దూరం పెడుతూ వస్తున్నాడట. ఇక ప్రస్తుతం దిల్ రాజు నుంచి రెండు సినిమాల సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలో బాలయ్య సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టమవుతుంది.

NBK109 - Nandamuri Balakrishna Birthday Glimpse | Bobby Kolli | Thaman S |  S Naga Vamsi - YouTube

ఇలాంటి క్రమంలో తన సొంత సినిమాలను తగ్గించి బాలయ్యకు థియేటర్లు ఇచ్చే సాహసం కూడా దిల్ రాజు చేయరు. డబ్బా థియేటర్లో ఇస్తే ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఇలాంటి క్రమంలో బాలకృష్ణ థియేటర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు వేచి చూడాలి. ఇప్పటికే థియేటర్లో ఇష్యూలో బాలయ్య, దిల్ రాజు పై కోపంగా ఉన్నారని.. వీరిద్దరి మధ్య పైకి కనపడని వివాదం జరుగుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సంక్రాంతి బరిలో థియేటర్లో ఇవ్వకపోతే ఈ వివాదం మరింతగా ముదిరే అవకాశం ఉంది. బాలయ్య.. దిల్‌రాజు అంతు చూడడం ఖాయం అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి.. థియేటర్ల అలాట్మెంట్ పూర్తయ్యే వరకు ఈ వివాదం పై క్లారిటీ రాదు.