స్టార్ హీరోయిన్గా సమంత ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే. అయితే గత ఏడాదిన్నరగా మయోసైటిస్ కారణంగా సినిమాలకు దూరమైంది సమంతా. తర్వాత అమ్మడు నటనకు సిద్ధమైన అవకాశాలు రాకపోవడంతో సినిమాల్లో నటించలేదట. మలయాళం లో మమ్ముట్టికి జంటగా మొదట నటించే ఛాన్స్ వచ్చిందని టాక్ వినిపించింది. అయితే అది జరగలేదు. తర్వాత చెన్నై లవ్ స్టోరీ అనే ఇంగ్లీష్ మూవీలో ఛాన్స్ వచ్చిందని వార్తలు వినిపించాయి. అయితే సమంత చేతి నుంచి ఇది కూడా చేజారిపోయింది.
కారణం ఏంటో తెలియదు గాని తర్వాత ఈ అవకాశం శృతిహాసన్ దక్కించుకుందని వార్తలు వినిపించాయి. తాజాగా ఈమె కూడా ఆ సినిమాలో నుంచి తొలగిపోయిందని టాక్. శృతిహాసన్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా సినిమా నుంచి వైదొలగడం అనేది ఇది రెండవసారి. ఇప్పటికే అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న డెకయిట్ మూవీలో అమ్మడు సగం షూట్‌ను పూర్తి చేసిన తర్వాత కూడా సినిమా నుంచి తప్పుకుంది. ఈ సినిమా టీజర్ కూడా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్న టైంలో.. శృతిహాసన్ తప్పుకోవడం ఏంటి అనే సందేహాలు కూడా వినిపించాయి. తాజాగా ఆంగ్ల మూవీ చెన్నై లవ్ స్టోరీ నుంచి కూడా శృతిహాసన్ తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే వీటన్నిటికీ కారణం ప్రస్తుతం శృతి నటిస్తున్న కూలీ మూవీనే అని టాక్. రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి స్కెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. రజిని అస్వస్థత కారణంగా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ కూతురుగా శృతిహాసన్ కనిపించనుంది. అయితే కాల్‌షీట్ల సమస్యల కారణంగా ఆమె చెన్నై లవ్ స్టోరీ నుంచి తప్పుకున్నట్లు టాక్ నడుస్తుంది. అలా శృతిహాసన్ కూడా ఈ సినిమా విషయంలో సమంతనే ఫాలో అవుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ కూలీ సినిమా సక్సెస్ కాకపోతే శృతిహాసన్‌కు సినిమా ఛాన్స్‌ల విషయంలో ఇబ్బందులు తప్పవంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.