14 ఏళ్లకే ఇండస్ట్రీ లో ఎంట్రీ.. టాలీవుడ్ స్టార్ హీరోతో ఎఫైర్.. ఆస్తులన్నీ కోల్పోయిన ఆ హీరోయిన్ ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టి స్టార్ హీరో హీరోయిన్లుగా రాణించన‌ వారు ఎంతోమంది ఉన్నారు. అయితే స్టార్ సెలబ్రిటీస్ అంత లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ.. హ్యాపీగా గడుపుతారని అంతా భావిస్తారు. కానీ.. అందులో ఏమాత్రం నిజం లేదు. స్క్రీన్ పై ఎంతో అందంగా నవ్వుతూ కనిపించే నటీనటుల జీవితాల్లో ఎన్నో విషాద సంఘటనలు కూడా ఉంటాయి. అలాంటి బాధలు అనుభవించిన వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఒకటి. ఇంతకీ ఆమె ఎవ‌రో చెప్పలేదు కదా.. తనే శ్రీవిద్య. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి.. సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ.. జీవితం పూలపాన్పు కానే కాదు. మొద‌టి నుంచి ఎన్నో క‌ష్టాలు చూసిన విద్య చిన్న వయసులోనే చనిపోయింది.

Kamal Haasan Srividya Love Story Kamal on Relationship with Actress  Srividya Loved More Than Anyone in Life | Kamal Srividya Love : 17 வயதில்  மலர்ந்த காதல்.. கமல் ஸ்ரீவித்யாவின் காதல் கதை ...

టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు పరిచయమే. బలరామకృష్ణుల నుంచి ముగ్గురు మొనగాళ్లు సినిమా వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీవిద్య.. విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుంది. అప్పట్లో స్టార్ హీరోస్ అంతా ఈమెతో జతకట్టేందుకు అరటపడేవారు. ఇక ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో ప్రొడ్యూసర్.. శ్రీ విద్య‌ రెండుపూట్ల స్నానం చేయడానికి బిస్లరీ వాటర్ బకెట్లతో తెప్పించేవారు. సినీ జీవితంలో అంతటి లచ్చరి లైఫ్ చూసిన ఈ అమ్మడు.. పర్సనల్ జీవితంలో అంతకుమించిన కష్టాలను ఎదుర్కొంది. శ్రీవిద్య చిన్న వయసు నుంచి ఎన్నో కష్టాలు. ప్రముఖ కమెడియన్ కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత కళాకారుని ఎమ్‌.ఎల్ వసంతకుమారి దంపతులకు 1953 జూలై 24న శ్రీ విద్య జ‌న్మించింది. ఇక శ్రీవిద్య పుట్టిన ఏడాదికే కృష్ణమూర్తికి ప్రమాదం జరిగి మంచాన పడిపోయారు.

The Timeless Love Story of Kamal Haasan and Srividya | Astro Ulagam

దీంతో కుటుంబ భారం మొత్తం తల్లి పైప‌డింది. ఇంట్లో పరిస్థితులు కష్టంగా ఉండడంతో 14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కే. బాలచందర్ డైరెక్షన్ లో అపూర్వ రాగంగ‌ళ్‌ సినిమాలో హీరోయిన్గా నటించే అవ‌కాశాని శ్రీ విద్య ద‌క్కించుకుంది. రజనీకాంత్, కమలహాసన్ లాంటి దిగ్గజనటులతో మొదటి సినిమాలో న‌టించి హిట్ కొట్టింది. దీంతో అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే కమలహాసన్ తోను శ్రీవిద్య ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. వీరి ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇలా నిజజీవితంలోనూ ఇద్దరు ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారట. కానీ శ్రీవిద్య తల్లి దీనికి ఒప్పుకోలేదు. దీంతో ఆమె లవ్ ఫెయిల్యూర్‌గా మిగిలిపోయింది. తర్వాత కమల్ హాసన్ స్టార్ హీరో అయ్యాడు. వేరే నటిని ప్రేమించినట్లు.. పెళ్లి చేసుకోబోతున్నట్లు శ్రీవిద్యకు తెలియడంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయింది.

Srividya - Wikipedia

ఇక కొంతకాలానికి మలియాల డైరెక్టర్ జార్జ్ తామస్తో ప్రేమలో పడి అతని వివాహం చేసుకుంది. 1978లో థామస్‌ను వివాహం చేసుకున్న శ్రీ విద్య‌ పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నా.. తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. ఈ క్రమంలో జార్జ్ శ్రీవిద్య ఆస్తులన్నీ లాగేసుకుని చివరకు తనను ఇంటి నుంచి గెంటేశాడు. ఇక 1980లో జార్జ్ నుంచి విడాకులు తీసుకున్న శ్రీవిద్య.. ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. ఈ క్రమంలోనే తన ఆస్తులను జార్జ్ నుంచి తిరిగి రప్పించుకోవడానికి కోర్ట్‌లో కేసు వేసి నెగ్గింది. చాలా కాలం పోరాడిన ఈమెకు విజయం దక్కింది. తర్వాత తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించినా ఆశించిన సక్సెస్ అందలేదు. 40ఏళ్ళ కెరీర్‌లో 800కు పైగా సినిమాల్లో నటించింది. 2003లో క్యాన్సర్ బారిన పడింది. ముందే తాను చ‌నిపోలాన‌ని తెలియ‌డంతో మాన‌సిక క్షోభ అనుభ‌వించింది. ఇక త‌ను చనిపోయే ముందే సంగీతం, నృత్యం నేర్చుకునే పేద విద్యార్థుల కోసం తన ఆస్తిని దానం చేయాలని నిర్ణయించుకుంది. నటుడు గణేష్ సహాయంతో దీని కోసమే ఒక స్పెషల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. 2006 అక్టోబర్ 2019 న ఆమె మరణించింది. చనిపోయే ముందు చాలామంది పిల్లలకు గొప్ప భవిష్యత్తును ఇచ్చింది.