సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంతకు ఎలాంటి క్రేజ్.. పాపులారిటీ ఉందో తెలిసిందే. అయితే గతంలో అక్కినేని కోడలుగా మారిన తర్వాత శ్యామ్ పాపులారిటీ మరింతగా పెరిగింది. నాగచైతన్య తో ఏడేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన సమంత.. పెద్దల అంగీకారంతో చైతన్య వివాహం చేసుకుంది. పెళ్లైన నాలుగేళ్లకే వీరికి డివోర్స్ కావడంతో.. సమంత పై ఎన్నో నెగటివ్ కామెంట్స్, వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె కారణంగానే చైతూ డివోర్స్ ఇచ్చేసాడని.. సమంతకు వేరే వ్యక్తితో ఎఫైర్ ఉందంటూ.. సమంత ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో వద్దని చెప్పిన బోల్డ్ గా నటించడంతో వీరిద్దరి మధ్యన మనస్పర్ధలు మొదలయ్యాయి అంటూ.. ఈ కారణంగానే ఇద్దరు డివోర్స్ తీసుకున్నారని రకరకాల వార్తలు వినిపించాయి.
ఇదిలా ఉంటే సమంత గతంలో చైతూతో విడాకులపై రియాక్ట్ అయింది. కరణ్ జోహార్ షోలో పాల్గొన్న ఆమె చాలా కఠినంగా డివోర్స్ గురించి వర్ణించింది. మా ఇద్దరిని ఒకే చోట.. ఒకే రూమ్‌లో ఉంచితే.. చుట్టు కత్తులు లేకుండా జాగ్రత్త పడాలి అంటూ వెల్లడించింది. ఇక అప్పట్లో సమంత అంత కోపంగా మాట్లాడిన.. చైతు మాత్రం సమంత గురించి పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యాడు. తనకు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరితో బాగా వర్క్ అవుట్ అవుతుంది అన్నే ప్రశ్నకు సమంత అంటూ చెప్పుకొచ్చాడు. ఆమెతో మళ్లీ కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని వెల్లడించాడు. ఇక వీరిద్దరూ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇక విరి విడాకులపై అసలు కారణం మాత్రం ఇప్పటికి బయటకు రాలేదు. ఇక విడాకుల తర్వాత పలు సినిమాలలో నటించినా.. అనారోగ్య కారణాలతో ఏడాదినరపాటు సినిమాలకు దూరమైంది. కాగా త్వరలోనే సిటాడెల్ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో స్పై ఏజెంట్‌గా కనిపించనుంది. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్న సమంత.. మీరు ఎప్పుడైనా నిజ జీవితంలో పై ఏజెంట్‌గా పని చేశారా అని ఇంటర్వ్యూవర్ ప్రశ్నకు సమాధానం చెబుతూ అలాంటిది ఎప్పుడు చేయలేదు.. కానీ నా జీవితంలో నిజంగానే అలా చేసి ఉంటే లైఫ్ బాగుండేదేమో అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ వైరల్‌గా మారడంతో.. తాను తన వివాహిక జీవితం పై స్పై చేసి ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తుందంటూ నెట్టింట అభిప్రాయాలు వెలువడుతున్నాయి.