నందమూరి నటసింహం బాలకృష్ణ గతేడాది వరస హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలయ్య తన 109వ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు. బాబి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన రెండు కీలక నిర్ణయాల్లో మేకర్స్‌కు కన్ఫ్యూషన్ నెలకొంది. మొదటిది టైటిల్ విషయంలో. కొన్ని పేర్లు పరిశీలించిన వాటిలో ఒకటి ఫైనలైజ్ చేయడానికి మరో రెండు, మూడు రోజుల సమయం టీంకు పడుతుందట. రెండో మ్యాటర్ ఏంటంటే.. మూవీ రిలీజ్ డేట్ జనవరి 9 మొదట మేకర్స్ అనుకున్నా.. ట్రేడ్ వర్గాల ప్రాథమిక సమాచారం లో మిశ్రమ స్పందన రావడంతో ఈ సినిమా విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది.
సంక్రాంతి పండక్కి అందరికంటే ముందు వస్తే ఓపెనింగ్స్ పరంగా బాగుంటుందని.. థియేటర్ల పరంగా ఇబ్బందులు ఉండవని ఆలోచన కరెక్టే కానీ.. జనవరి 10న గేమ్ చేంజర్ రానుంది. ఈ క్రమంలో కలెక్షన్ల మీద చాలా ప్రభావం పడుతుంది. అంతేకాదు ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు ఖర్చు పెట్టే విషయంలోనే కాదు.. డిస్ట్రిబ్యూషన్ విషయంలోనూ ఎంత ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎక్కువ థియేటర్లలో తమ మూవీ అగ్రిమెంట్లకు అడుగులు వేస్తున్నాడు. ఇక ఎన్బికె 109 ప్రొడ్యూసర్ నాగవంశీతో వ్యాపార పరంగా లావాదేవీలు, సన్నిహిత్యం దిల్ రాజుకు ఉన్న సొంత సినిమా దగ్గరకు వచ్చేసరికి ఎవరైనా ఒకటే అనేది ఇండస్ట్రీలో ఎప్పుడు ఉండే సూత్రం. ఈ క్రమంలోనే బాలయ్యకు సెకండ్ డే నుంచే స్క్రీన్ లు తగ్గి.. కలెక్షన్ల పై విపరీతమైన ప్రభావం పడుతుంది.
పైగా ఒకవేళ వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమా కూడా బరి లో ఉందంటే పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది. దీంతో జనవరి 12న బాలయ్య సినిమా రిలీజ్ చేయడం అన్ని విధాల సేఫ్ అని అభిమానులతో పాటు.. బయ్యర్స్ కూడా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారట. కంటెంట్ బాగుంటే లేటుగా వచ్చిన ఇబ్బంది ఉండదు.. అయితే గతేడాది వాల్తేరు వీరయ్య వచ్చిన తర్వాత విరసింహారెడ్డి రిలీజై రెండు సినిమాలు మంచి సక్సస్ అందుకున్నాయి. కానీ కలెక్షన్‌ల పరంగా చిరంజీవిది పై చేయి అయ్యింది. సో ఇలాంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఈ క్రమంలోనే జనవరి 9 తో రిలీజ్ డేట్ లో ముడిపడిన రిస్కులను విశ్లేషించుకుంటున్నారు టీం. దీపావళి పండక్కు రిలీజ్ డేట్ ఎలాగైనా అనౌన్స్ చేయాలని ఆలోచనలో ఉన్నారు.