టాలెంట్‌లో తగ్గేదేలే అంటోన్న మహేష్ ఫ్యాన్స్.. ఎస్ఎస్ఎంబి29 యూనిక్ పోస్టర్ అదుర్స్.. !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ అంతా ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా గ‌డుపుతున్నారు. ఈ క్రమంలో మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండ‌ని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మూవీ జోనర్ ఏంటో రివిల్ చేయకపోయినా.. మహేష్ లుక్ ఇలానే ఉండాలని మాహేష్‌ అభిమానులు ఊహగానాల్లో మునిగిపోయారు. ఇందులో భాగంగానే వారి టాలెంట్‌కు పదును పెడుతూ వైవిధ్యమైన పోస్టర్లను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

మహేష్ బాబుతో ట్రీటింగ్ యాక్షన్ మూవీ చేయబోతున్నానని రాజమౌళి గతంలోనే అనౌన్స్ చేశారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా రూపొందుతుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇండియన్ జోన్స్ తరహాలో సినిమా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మహేష్ బాబు అభిమాని తన టాలెంట్ను పోస్టర్ రూపంలో బయటపెట్టాడు. ఆట మొదలైంది.. వేట కొనసాగుతుంది.. అంటూ సోషల్ మీడియా వేదికగా ఇది షేర్ చేసుకున్నాడు. ఇక ఈ పోస్టర్ నెటింట వైరల్‌గా మారడంతో.. ఆ అభిమాని టాలెంట్ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఎస్ఎస్‌య‌మ్‌బి 29 యూనిక్ పోస్టర్ అదుర్స్ అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పోస్టర్లు మహేష్ బాబు గుర్రంపై కూర్చొని ప్రపంచాన్ని చూడడానికి బయలుదేరిన ఓ సాహస యాత్రికుడిలా దర్శనమిచ్చాడు.

బయట లుక్ చూస్తున్న విధంగానే.. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్, నెత్తిన క్యాప్, వెనుక బ్యాగ్ తగిలించుకొని స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ పోస్టర్ను చూడగానే ఓ ఫ్యాన్ డిజైన్ చేసిన‌ పోస్టర్ల అసలు అనిపించదు. అఫీషియల్ గా మేకర్స్ దీనిని రిలీజ్ చేశారా అనేంత రియలిస్టిక్ గా ఆ పోస్టర్ కనిపిస్తుంది. ఇక సినిమాలోను మహేష్ బాబు ఇదే లుక్ లో కనపడతాడేమో అంటూ.. అభిమానులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే రాజమౌళి సినిమా కోసం మహేష్ మేకోవ‌ర్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా షూట్ 2025 జనవరిలో ప్రారంభించనున్నారు.