ప్రస్తుతం అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య.. కార్తికేయ 2 ఫేమ్ చందూమోండేటి డైరెక్షన్లో తండేల్ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్2 బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాల్లో.. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. ఇక నాగచైతన్య ఈ సినిమా తర్వాత శివానిర్మాణ డైరెక్షన్ లో ఓ కథలో నటించనున్నాడట. ఈ క్రమంలో శివ.. చైతుకి ఒక కథను వినిపించినట్లు తెలుస్తుంది. ఖుషి సినిమా తర్వాత శివానిర్మాణ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో స్పష్టతతో వ్యవహరిస్తున్నారు.
నాగచైతన్యతో ఆయన త్వరలోనే ఓ సినిమా చేయనున్నాడు. ఇక గతంలో వీరిద్దరి కాంబోలో మజిలీ సినిమా తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోలో ఓ లవ్ స్టోరీ రానుందని.. మైత్రి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఇక ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న తండేల్‌ను సంక్రాంతిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అది కుదరకపోతే ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమా కోసం చైతు ఫిజికల్‌గా, మెంటల్‌గాను ఎంతో శ్రమించాడు.
ఈ క్రమంలోనే తండేల్ పూర్తయిన తర్వాత.. సాఫీగా సాగిపోయే ఓ క్లాసికల్ సినిమాలో నటించాలని ఆయన భావిస్తున్నారని.. ఈ ఆలోచనతోనే శివ నిర్మాణ కూడా.. అలాంటి ప్రాజెక్టును ముందుకు తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్‌ను హీరోయిన్గా తీసుకొనున్నారట. ఇక చైతన్య – జాన్వి కపూర్ కాంబో కూడా టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ కాంబోగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. గతంలో శ్రీదేవి అటు తాత ఏఎన్ఆర్, తండ్రి నాగార్జునతో కూడా కలిసిన నటించారు. ఈ క్రమంలోనే ఆమె వారసురాలు జాన్వీ కపూర్.. నాగచైతన్యతో నటించడం అంటే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉంటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ కాంబో దాదాపు సెట్ అయ్యిందట.