టాలీవుడ్ సీనియర్ యాక్టర్ మురళీమోహన్‌కు తెలుగు ఆడియోస్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. స్టార్ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. అయితే మురళీమోహన్ తన లైఫ్‌లో ఇప్పటికే తన పేరును రెండుసార్లు మార్చుకున్నారన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. ఇంతకీ ఆయన అసలు పేరు ఏంటి.. ఎందుకు రెండుసార్లు ఆ పేర్లు మార్చుకోవాల్సి వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం.
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత కెరీర్ ప్రారంభంలో పేరు మార్చుకుని సక్సెస్ సాధించి స్టార్ హీరోలుగా మారిన వారు ఎంతమంది ఉన్నారు. అలా సక్సెస్ అయిన పేరుతోనే ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కాగా సీనియర్ యాక్టర్ మాగంటి మురళీమోహన్ ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరో గానే కాదు.. నిర్మాతగాను వ్యవహరించారు. రాజకీయ నాయకుడిగా, బిజినెస్ మాన్ గాను ఆయన మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో ఖ్యాతిని పొందిన మురళి మోహన్.. 350 కి పైగా సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఈ క్రమంలో ఆయన రెండుసార్లు తన పేరును మార్చుకున్నట్లు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొదట ఆయన తల్లిదండ్రులు రాజా రామ్మోహన్ రాయ్ అని పేరు పెట్టారని.. స్వతంత్ర సమరయోధులు అంటే ఆయనకు ఎంతో ఇష్టం.. అందుకే నాకు ఆ పేరు పెట్టారంటూ చెప్పుకొచ్చాడు. ఇక స్కూల్ కి విళ్ళిన తర్వాత ఆ పేరు ఇబ్బందిగా ఉండడంతో రాజాబాబుగా మార్చారు. మరోసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత రాజబాబు పేరును మురళీమోహన్ గా మార్చుకున్నా అంటూ చెప్పుకొచ్చాడు. అలా పేరు మార్చుకున్న మురళీమోహన్ తర్వాత ఎన్నో సినిమాలో హీరోగా నటించి సక్సెస్ అందుకున్నారు. అంతేకాదు ఇప్పటికీ అదే పేరుతో ఇండస్ట్రీలో కొనసాగుతూ గొప్ప నటుడిగా ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాడు.