కోలీవుడ్‌లో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్గా మాళవిక మోహన్ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ట్ ప్రభాస్ సరసన రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. కొన్ని రోజులుగా మూవీ షూటింగ్లో సందడి చేస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా యూధ్ర మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మాళవిక ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
![Malavika Mohanan [3277 x 4096] : r/BollywoodUHQonly](https://external-preview.redd.it/malavika-mohanan-3277-x-4096-v0-RNWmxs5Nd64PelP9pUUCWOSGXOp9AeJaToYH-cujEH0.jpg?width=640&crop=smart&auto=webp&s=8ff837604e07efc5cb103a549bc7873da4471673)
ఓ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందంటే.. ఆ సినిమాలో హీరోలకు పెద్ద పెద్ద గిఫ్ట్ లు ఇస్తారు. హీరోయిన్లకు మాత్రం అలాంటిదేమీ ఉండదు. అసలు గమనించరు కూడా అంటూ చెప్పుకొచ్చింది. ఏదైనా ఫ్లాప్ ఎదురైతే మాత్రం హీరోయిన్ అన్ లక్కి, హీరోయిన్ ఐరన్ లెగ్. ఆమె వల్ల సినిమా ఫ్లాప్ అయిందంటూ తిడతారని షాకింగ్ కామెంట్ చేసింది. ప్రస్తుతం మాళవిక మోహన్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.

2013లో పట్టంపోల్ మూవీ తో మలయాళ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత కన్నడ, తమిళ ఇండస్ట్రీలోనూ రాణించింది. సక్సెస్ అందుకున్న మాళవిక.. ఇప్పుడు సిద్ధాంత్ చతుర్వేది హీరోగా తెరకెక్కుతున్న యుధ్రాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలో అమ్మడు ప్రభాస్ రాజాసాబ్తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా సక్సెస్ అయితే టాలీవుడ్‌లోను మరిన్ని అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం మాళవిక బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.

