టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత.. గతంలో డైరెక్టర్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో బోల్డ్ క్యారెక్టర్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిటాడెల్:హనీ.. బన్నీ.. సిరీస్‌లో కూడా అమ్మడు నటిస్తుంది. అయితే మయోసైటిస్‌తో బాధపడుతున్న శ్యామ్.. మొదట్లో నేను ఈ సిరీస్ లో నటించలేనని.. వేరే వాళ్ళని చూసుకోవాలని డైరెక్టర్లు బతిమిలాడినట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. మయోసైటిస్‌తో సతమతమవుతున్న సమంత.. అలాంటి పరిస్థితుల్లోనూ సిటాడెల్:హనీ.. బన్నీ.. లాంటి యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఇందులో ఆమె చాలా యాక్షన్స్ సన్నివేశాల్లో నటించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.
అయితే ఈ అనారోగ్యంతో నేను అలాంటి యాక్షన్ సీన్స్ చేయలేనని డైరెక్టర్లను బతిమాలుకున్నానని.. నన్ను వదిలేసి వేరే వాళ్ళను చూసుకోమని మరో హీరోయిన్ కూడా సిఫార్సు చేశానని.. ఈ హీరోయిన్ అయితే చాలా బాగుంటుంది.. ఆమె బాగా నటిస్తుంది.. నా వల్ల కాదు వదిలేసేయమని అడిగానని.. నలుగురి పేర్లు చెప్పానని అప్పట్లో నేను నిజంగానే చాలా అనారోగ్యంతో ఉన్న అంటూ సమంత వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ సిరీస్‌లో నటించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని.. ఇప్పుడు ఈ షో చూసిన తర్వాత నేను లేకుండా వాళ్లు సినిమా తీయనందుకు చాలా కృతజ్ఞురాలినంటూ వెల్లడించింది.
ఈ సిరీస్ చేసేందుకు అవసరమైన శక్తి నాకు వచ్చిందని.. ఈ షోపై ఇంకా ప్రేక్షకుల స్పందన రాకపోయినా.. నాకు నేనుగా ఈ సిరీస్ లో నటించినందుకు ఆనందంగా అనిపిస్తుంది అంటూ సమంత వెల్లడించింది. ఇక ఈ హనీ.. బన్నీ.. వెబ్ సిరీస్ నవంబర్ 9న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావడానికి సిద్ధమవుతుంది. 1980 నేపథ్యంలో సాగే ఓ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా ఇది రూపొందింది. ఇంగ్లీష్‌లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడల్కు ఫ్రీక్వెల్‌గా ఈ సిరీస్ రాబోతుంది. ఈ సినిమాలో వరుణ్, సమంత 8 ఏళ్ల కూతురుగా.. (నదియా సింగ్) ప్రియాంక చోప్రాను చూపించారు. ఈ వెబ్ సిరీస్ నుంచి ట్రైలర్ ఇటీవల రిలీజ్ చేయక ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది.