స్టార్ బ్యూటీ శోభిత ధూళిపాళ్లకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాల కంటే కాబోయే అక్కినేని కోడలిగా తెలుగు ప్రేక్షకుల్లో మరింత పాపులారిటీ దక్కించుకున్న శోభిత.. మొదట మోడల్గా కెరీర్ ప్రారంభించి తర్వాత నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఇమేజ్ దక్కించుకుంది. శోభిత పుట్టింది, పెరిగింది అంతా వైజాగ్ లోనే. అయినా తన కెరీర్ ముంబైలోనే ప్రారంభమైంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని శోభిత తన కెరీర్ ప్రారంభంలో ఏదురైన చేదు అనుభవాల గురించి కష్టాల గురించి వివరించింది.
తను మాట్లాడుతూ లక్ష్యం లేకుండానే సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాను.. మోడల్గా ఆడిషన్స్‌కి వెళ్లే క్రమంలో ఎన్నో సంఘటనలు.. అవమానాలు ఎదుర్కొన్న.. ఎంతో బాధపడ్డా.. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న సమయంలో మోడలింగ్ చేయాలని ప్రయత్నించా.. ఈ క్రమంలో తెల్లగా లేనని ఎన్నో విమర్శలను చూశా అంటూ ఎమోషనల్ అయింది. అలా గతంలో ఓ షాంపూ యాడికి వెళ్తే నువ్వు కనీసం బ్యాగ్రౌండ్ మోడల్‌గా కూడా పనికిరావు అంటూ ఇన్‌సల్ట్ చేశారని.. తర్వాత ఇంటికి వెళ్లి అద్దంలో చూసుకుని చాలా రోజులు బాధపడుతూనే ఉన్నా అంటూ శోభిత ధూళిపాల వెల్లడించింది.
మీ వాయిస్ బాగుంటుందని అందరూ అనేవాళ్ళు.. అలా నాలో కాన్ఫిడెన్స్ కాస్త పెరిగింది. చివరకు 100 ఆడిషన్లకు హాజరయ్యాక 2016లో అనురాగ్ కస్యప్.. రామన్ రాఘవన్ 2లో అవకాశం దక్కిందంటూ వెల్లడించింది. ఇక ఈ సినిమా తర్వాత.. తనను రిజెక్ట్ చేసిన షాంపూ కంపెనీ ఐశ్వర్య పక్కన యాడ్లో నటించాలని.. తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉండమని ఆఫర్ చేసిందంటూ వెల్లడించింది. ఇక ప్రస్తుతం అమ్మడు చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవుతున్నాయి.