ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా తెరకెక్కిన.. ఆ సినిమా రిలీజై రిజల్ట్ వచ్చేవరకు సినిమా హిటా, ఫ్లాపా అనేది ఎవరికి తెలియదు. అయితే సినిమా రిలీజై ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా చాలామంది మదిలో ఆ సినిమా క్లాసికల్‌గా ప్రింట్ అయిపోతుంది. అలా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా క్లాసికల్‌గా అభివర్నించే సినిమాల్లో మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అలా మహేష్ బాబు ముద్దుల కూతురు సితారకు కూడా మహేష్ బాబు నటించిన ఓ ఫ్లాప్ సినిమా.. చాలా స్పెషల్ అట. ఆ సినిమా తనకు విపరీతంగా నచ్చుతుందని.. మహేష్ బాబు క్యారెక్టర్ ఐకానిక్ గా తాను ఫీలవుతుందంటూ చెప్పుకొచ్చింది.
ఇంతకి ఈ మూవీ ఏంటో ఒకసారి చూద్దాం. మాట్లాడే విధానం, క్యూట్ నెస్, డ్యాన్స్, స్మైల్ ఇలా ప్రతి విషయంలోను ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న మహేష్ బాబు గారాల పట్టి సితారకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఇటీవల జ్యువలరీ సంస్థను ప్రమోట్ చేస్తూ.. విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది సితార. ఇండస్ట్రీలో నటిగా మారేందుకు అమ్మడు తెగ ఆరాటపడుతుంది. సినిమాలపై అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. తండ్రి మహేష్ బాబు నటించిన సినిమాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సితార మహేష్ నటించిన సినిమాల్లో తనకు బాగా ఇష్టమైన మూవీ ఖలేజా అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార.. యాంకర్ అడిగిన ప్రశ్నకు మహేష్ నటించిన అన్ని సినిమాల్లో ఖలేజా తన ఫేవరెట్ అంటూ చెప్పుకొచ్చింది.
సాధారణంగా ఖలేజ గురించి చెప్పాలంటే ఎవరైనా కాస్త సంకోచిస్తారు. కానీ.. నువ్వు అదే సినిమా బెస్ట్ అని చెప్తున్నావ్ కారణమేంటి.. అని యాంకర్ ప్రశ్నించారు. దానికి సితార మాట్లాడుతూ ఈ సినిమాల్లో నాన్న నటించిన సీతారామరాజు క్యారెక్టర్ ఐకానిక్ అంటు తాను వివరించింది. ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టమని.. నాన్న సినిమాల్లోనే ఖలేజా ది బెస్ట్ మూవీ అంటూ సితార చెప్పుకొచ్చింది. నాన్న క్యారెక్టర్ మాత్రమే కాదు.. సినిమాలో ప్రతి విషయం నాకు నచ్చుతుందంటూ ఈ అమ్మడు పేర్కొంది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచినా.. టీవీలో మాత్రం ఈ సినిమా టెలికాస్టై వ్యూస్‌తో రికార్డ్ సొంతం చేసుకుంది. మహేష్ బాబు లోని కామెడీ యాంగిల్ ని కూడా త్రివిక్రమ్ ఈ సినిమాతో రివీల్ చేశారు.