ఏంటి.. సీనియర్ ఎన్టీఆర్ ఆ ఇద్దరు హీరోయిన్లను ప్రాణంగా ప్రేమించారా.. కానీ..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉందంటే.. దానికి మూల కార‌ణం ఎన్‌టీఆర్‌, ఏఎన్ఆర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. వారిద్దరు స్టార్ హీరోలుగా ఎదుగుతూ ఇండస్ట్రీ ని కూడా ఎదిగేలా.. ఇండస్ట్రీకి ఖ్యాతి పెరిగేలా చేశారు. ఇక వీరిద్దరిలో సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోనే కాకుండా.. రాజకీయాలను ఎన్నో సంచలనాలను సృష్టించాడు. అప్పట్లో ఎన్టీఆర్ ఏ రంగంలో అడుగుపెట్టిన ఆయన ఎదగడమే కాకుండా.. ఆ రంగాన్ని కూడా డెవలప్ చేస్తూ మంచి పేరు తెచ్చేవాడు. అలాంటి ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్య పాత్రలో నటించి ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు.

అయితే ఆయన ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో కొంతమంది హీరోయిన్లతో ప్రేమలో పడ్డారని.. ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్లను ప్రాణంగా ప్రేమించారని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాళ్ళు ఎవరు.. అసలు ఆ విషయాలంటే ఒకసారి తెలుసుకుందాం. సీనియర్ ఎన్టీఆర్ మొదటి నుంచి జాతకాలను ఎక్కువగా నమ్మే వ్యక్తి అని ఇండస్ట్రీలో టాక్‌ నడిచేది. అయితే ఆయన రెండో పెళ్లి చేసుకుంటే మ‌హ‌ర్ధ‌శ‌ పడుతుందని ఎవరో జాతకంలో వర్ణించారట. ఈ క్రమంలో ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించారట. ఇందులో భాగంగానే హీరోయిన్ కృష్ణకుమారిని ప్రేమించారట. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆయన ఫిక్స్ అయ్యాడట.

ఆ విషయం తెలిసిన ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు రంగంలోకి దిగి.. కృష్ణకుమారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. అన్నయ్యను మర్చిపోయి ఆయనకు దూరంగా వెళ్ళిపో.. లేదంటే నిన్ను చంపేస్తా అని ఆయన బెదిరించడంతో కృష్ణకుమారి ఇండస్ట్రీని, ప్రేమను వదులుకుందట. ఇక ఎన్టీఆర్ ఆమె కంటే ముందే సీనియర్ హీరోయిన్ దేవికను ప్రేమించాడని.. ఈ హీరోయిన్ ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఎన్టీఆర్ అని తెలుస్తోంది. అప్పట్లో వీరిద్దరి మధ్యన ఎఫైర్ వార్తలు గట్టిగానే నడిచాయి. ఈమెను కూడా మొదట ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవాలని భావించారట. కానీ.. ఎవో అనివార్య‌ కారణాలతో అది కూడా ఫెయిల్ అయింది. అలా చివరకు లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకున్నాడట.