ఎన్నో ఏళ్ళ క్రితమే 80 దేశాల్లో బ్లాక్ బస్టర్ అందుకున్న కృష్ణ.. మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియాలెవెల్‌లో ఖ్యాతిని సంపాదించుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే బాహుబలి సినిమా నుంచి పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ లో ప్రారంభమయ్యాయి అని అంతా భావిస్తారు. కానీ.. దాదాపు 53 ఏళ్ల క్రిందటే సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ఏకంగా 80 దేశాల్లో బ్లాక్ బ‌స్టర్ హిట్ కొట్టింద‌ని చాలా మందికి తెలియ‌దు. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం. తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్తతరం సినిమాలను పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ.. సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ నిర్న‌యాలు తీసుకుంటూ.. ప్రయోగాత్మక సినిమాలను ఎంచుకుంటూ.. తన సత్తా చాటేవాడు.

ఈ క్రమంలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన కృష్ణ.. అప్పట్లోనే ఓ పాన్ ఇండియన్ స్థాయిలో సినిమాను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. అసలు కృష్ణ ఓ సినిమాను చేయాలని ఫిక్స్ అయితే.. ఆ బడ్జెట్ గురించి అస‌లు బ‌య‌ప‌డేవారు కాదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించేది. తను అనుకున్న సినిమాను చేసి ఎలాగైనా తన సత్తా చాటేవాడు. అలాంటి సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా అల్లూరి సీతారామరాజు. ఆయన కెరీర్‌లోనే ఇది ద బెస్ట్ మూవీ. ఇదే కాదు 50 సంవత్సరాల క్రితం కృష్ణ నటించిన ఓ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయగా 80 దేశాల్లో సూపర్ హిట్ అందుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా.. మోసగాళ్లకు మోసగాళ్లు. కె. ఎస్. దాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ 1971లో రిలీజ్ అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త పందాలో ఈ సినిమా తెర‌కెక్కింది.

ఇక ఇందులో కృష్ణ స‌ర‌సన విజయనిర్మల హీరోయిన్గా నటించారు. గుమ్మడి, కైకాల సత్యనారాయణ, నాగభూషణం లాంటి కీలక తారాగ‌ణం అంత ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా టైంలో చాలామంది కృష్ణకు ఇలాంటి డెసిషన్ తీసుకోవద‌ని చెప్పారట. అయితే కేవలం ఎన్టీఆర్ మాత్రమే ఈ సినిమా చేసేయండి.. కచ్చితంగా హిట్ అవుతుందని వివరించాడట. ఇక కృష్ణ మొదటి నుంచి హాలీవుడ్ సినిమాలను బాగా చూసేవారిని.. అదే విధంగా హాలీవుడ్ తరహాలో తెలుగు సినిమాను తెరకెక్కించి ఇండస్ట్రీలో సరికొత్త సినిమాగా తీయాలని మోసగాళ్లకు మోసగాళ్లు సినిమాను ప్లాన్ చేశారట. తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ లోనే ఈ సినిమాను ప్రారంభించి సినిమాను పూర్తి చేశాడు. 1971 ఆగస్టు 27 రిలీజ్ అయిన ఈ సినిమా ఇంగ్లీషులో డబ్ అయ్యి ఏకంగా 80 దేశాల్లో సూపర్ హిట్ గా నిలవడమే కాదు.. అప్పట్లో లక్షల రూపాయల వసూలను కొల్లగొట్టి రికార్డ్ సృష్టించింది.