“యస్..ఆ రూమర్ నిజమే.. రిలేషన్ షిప్ లో ఉన్న”.. కృతి శెట్టి సంచలన స్టేట్మెంట్..!!

కృతి శెట్టి.. ఈ మధ్యకాలంలో బోల్డ్ గా మాట్లాడుతున్న విషయం తెలిసిందే . ఆమెను పలువురు జనాలు ట్రోల్ చేస్తున్న సరే ..కృతి శెట్టి మాత్రం ఎక్కడ ఇబ్బందికర సిచ్యువేషన్ రాకుండా ..తన పేరుని సేఫ్ జోన్ లోకి వచ్చేలా ప్లాన్ చేసుకుంటుంది .. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన కృతి శెట్టి .. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన పెద్దగా క్రేజ్ అందుకోలేకపోయింది.. ఫేడ్ అవుట్ బ్యూటీ అయిపోయింది.

ప్రజెంట్ కోలీవుడ్లో స్టార్ గా రాజ్యమేలేస్తుంది . తెలుగులో ఆమె నటించిన మనమే సినిమా జూన్ 7వ తేదీ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఆమె సినీ ప్రమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. తాజాగా కృతి శెట్టి ఇంటర్వ్యూలో పాల్గొంది . ఈ క్రమంలోనే ఆమె రిలేషన్షిప్ లో ఉన్నాను అంటూ సెన్సేషనల్ విషయాన్ని బయట పెట్టింది . “మీరు రిలేషన్షిప్ లో ఉన్నారా..?”.. అంటూ అడిగిన ప్రశ్నకు..అద్దిరిపోయే counter ఇచ్చింది.

“ఎస్ అది నిజమే .. నేను రిలేషన్షిప్ లో ఉన్నాను .. ఎవరితో అని అడగ్గా… నా కెరియర్ తో నా ప్రొఫెషన్తో అంటూ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చింది “. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . కృతి శెట్టి చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చింది అంటున్నారు అభిమానులు. అంతేకాదు కృతిశెట్టి ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంటుంది అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మొత్తానికి బాగానే తెలివి తేటలు చూయిస్తుంది ఈ బ్యూటీ..!!