మోక్షజ్ఞకు పోటీగా ఆ స్టార్ హీరో కొడుకు సినీ ఎంట్రీ ..ఇప్పుడు కథలో అసలైన మజా..!

సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోతున్నాయి .. ట్రెండ్ కూడా మారిపోతుంది ..నిన్న మొన్నటి వరకు స్టార్ గా ఉన్న వాళ్ళు సీనియర్స్ అయిపోతున్నారు.. ఇప్పుడు తండ్రులు పోయి కొడుకులు ఆ స్థానాన్ని అందుకునే స్థితికి వచ్చేస్తున్నారు. ఇండస్ట్రీలో పూర్తిగా లెక్కలు మారిపోతున్న సిచువేషన్స్ మనం చూస్తున్నాం . రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు . ఆయన ప్లేస్ లోకి ఆయన కొడుకు అకిరా రాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

నిన్న మొన్నటి వరకు అకిరానందన్ బయట పెద్ద కనిపించేవాడు కాదు . ఎవరితో మింగిల్ అయ్యేవాడు కూడా కాదు . కానీ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన పవన్ కళ్యాణ్ విజయం తర్వాత అఖీరానందన్ ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్నాడు . పవన్ కళ్యాణ్ కూడా తాను ఎక్కడికి వెళ్తే కొడుకును అక్కడ వెంట పెట్టుకొని తీసుకెళ్తున్నాడు . కాగా ఇప్పుడు ఇదే విషయం గా మరొక స్టార్ హీరోకి తలనొప్పులు ఎదుర్కోవాల్సిన సిచువేషన్ వస్తుంది.

త్వరలోనే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. నిజానికి ఎప్పుడో మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలి. కానీ సెప్టెంబర్ 2025వ సంవత్సరంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇస్తే ఆయన కెరియర్ బాగుంటుంది అంటూ ఓ జ్యోతిష్కుడు చెప్పాడు అన్న రీజన్ తో బాలయ్య ఇన్నాళ్లు ఆయన సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారట . అయితే ఇప్పుడు సరిగ్గా అదే మూమెంట్ కి పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ కూడా సినిమా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట . దీంతో బాలయ్య కొడుకు మోక్షజ్ఞకు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ కు మధ్య టఫ్ ఫైట్ నెలకొనబోతుంది అంటూ ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు జనాలు..!!