బన్నీను కాదు అని ఆ తెలుగు హీరోతో సినిమాకి కమిట్ అవుతున్న అట్లి ..కొంప ముంచేశావ్ కదారా బాబు..!?

ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ కూడా టూ స్మార్ట్ గా మారిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఏ హీరోతో సినిమాను తెరకెక్కించాలి అనే విషయాన్ని అప్పుడప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారు. ఏ హీరోకి క్రేజ్ ఉంటే .. ఆ హీరోతో పక్కాగా మూవీ ని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా పాపులారిటి సంపాదించుకున్న అట్లీ త్వరలోనే అల్లు అర్జున్తో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది .

పుష్ప2 సినిమా కంప్లీట్ అవ్వగానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు అంటూ బాగా వైరల్ అయ్యాయి వార్తలు . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ లాస్ట్ మినిట్ లో ఈ సినిమా క్యాన్సిల్ అయింది అంటూ తెగ వార్తలు హల్చల్ చేస్తున్నాయి . కొందరు మెగా ఫాన్స్ చేసే ట్రోలింగ్ కారణంగానే అట్లీ హర్ట్ అయ్యి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు ..అంటుంటే మరికొందరు అసలు ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయింది అంటూ మాట్లాడుకుంటున్నారు .

అయితే తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త ట్రెండింగ్లోకి వచ్చింది అట్లీ .. బన్నీతో సినిమా క్యాన్సిల్ చేసి మరొక తెలుగు హీరోతో సినిమాని ఓకే చేసుకున్నాడు అన్న న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే జనాలకు మండిస్తుంది . బన్నీతో సినిమాను వద్దు అనుకున్న అట్లీ రాంచరణ్ తో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధపడుతున్నాడట . ఈ న్యూస్ తెలుసుకున్న బన్నీ ఫాన్స్ ఓ రేంజ్ లో అట్లీను ఆడేసుకుంటున్నారు..!!