పవన్ కళ్యాణ్ లైఫ్ లో ఆమె “ది మోస్ట్ స్పెషల్”.. ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకం..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు పవన్ అభిమానులు . టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకొని హ్యుజ్ రేంజ్ ఆఫ్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న ఈ హీరో రీసెంట్గా ఎమ్మెల్యేగా గెలిచాడు . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కని విని ఎరుగని ఊహించని రేంజ్ లో తన ప్రత్యర్థి వంగా గీతా పై 74 వేల ఓట్ల మెజారిటీతో సంచలన విజయాన్ని నమోదు చేశారు .

ఏపీ పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ గా మారిపోయాడు . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . పవన్ కళ్యాణ్ లైఫ్ లో శృతిహాసన్ ది మోస్ట్ స్పెషల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఏకంగా మూడుసార్లు స్క్రీన్ షేర్ చేసుకుంది శృతిహాసన్. ఈ రేంజ్ లో ఆయనతో నటించిన హీరోయిన్ ఎవరూ లేరు . ఫస్ట్ టైం గబ్బర్ సింగ్ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఈ సినిమాలో వీళ్లిద్దరి పర్ఫామెన్స్ టు గుడ్ ..కెవ్వు కేక భార్యాభర్తలుగా కలిసి కనిపించారు . ఆ తర్వాత కాటమరాయుడు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ..వీళ్ళిద్దరి పర్ఫామెన్స్ టు నాటిగా అనిపించింది ..ఈ సినిమా హిట్టు కాకపోయినా వీళ్ళిద్దరి కాంబో మాత్రం అభిమానులను ఆకట్టుకుంది.. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ శృతిహాసన్ కలిసి నటించి మెప్పించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో మూడుసార్లు స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్గా శృతిహాసన్ రికార్డ్ నెలకొల్పింది . అందుకే ఆమె అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కూడా స్పెషల్ గౌరవం..!!