ఆఖరికి ఆ హీరోతో సర్దుకుపోతున్న సమంత.. ఎంత విచిత్రం అంటే..?

సమంత .. ఏ డెసిషన్ తీసుకున్న సరే అందులో కచ్చితంగా అర్థం ఉంటుంది అంటూ ఉంటారు ఆమె ఫ్యాన్స్ . బహుశా అది నిజమే అనిపిస్తూ ఉంటుంది . ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత తనకు వద్దకు వచ్చే ఆఫర్స్ ని రిజెక్ట్ చేస్తూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా బడా బడా స్టార్ హీరోల సినిమాలను కూడా ఆమె రిజెక్ట్ చేయడం సంచలనంగా మారింది. కోట్లకు కోట్లు ఆఫర్ ఇస్తామన్నా కూడా ఎందుకు సమంత అలాంటి ప్రాజెక్ట్ ని చేయలేదు అని అంతా మాట్లాడుకున్నారు.

అయితే సమంత కొన్ని వ్యక్తిగత కారణాల చేతే కొందరితో నటించకూడదు అంటూ డిసైడ్ అయిందట . ఫైనల్లీ ఖుషి సినిమా తర్వాత మళ్లీ ఒక బిగ్ ప్రాజెక్టుకు సైన్ చేసింది సమంత అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ హీరోగా క్రేజీ పాపులారిటీ దక్కించుకున్న ఆదిత్య రాయి కపూర్ . యస్ ప్రసెంట్ ఈ న్యూస్ బాలీవుడ్ లో బాగా ట్రెండ్ అవుతుంది.

ఒక వెబ్ సిరీస్ లో ఆదిత్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట సమంత . ఆశ్చర్యమేంటంటే సిటాడిల్ , ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేసిన డీకే అండ్ రాజ్ తోనే ఈ సిరీస్ కూడా చేయబోతుంది సమంతా అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ మారుమ్రోగిపోతుంది . చూడాలి మరి ఏం జరుగుతుందో ..?సమంత తీసుకున్న ఈ నిర్ణయం ఆమెకు ఎంతవరకు కలిసి వస్తుందో..?