నార్త్ ఆడియన్స్ పై ప్రభాస్ ఓపినియన్ ఇదా..? అంత మాట అనేశాడు ఏంటి..?

కల్కి ..సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ మాట్లాడిన మాటల తాలూకా వీడియో ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. ఎప్పుడు కూడా ప్రభాస్ ఓపెన్ గా మాట్లాడడు. ఆ విషయం అందరికీ తెలిసిందే.. మాట్లాడిన నాలుగు ముక్కలు కూడా తూతూ మంత్రంగా మాట్లాడేస్తాడు. అయితే కల్కి సినిమా ప్రమోషన్స్ లో మాత్రం నాలుగు ముక్కలు ఎక్కువగానే మాట్లాడుతున్నాడు ప్రభాస్. రీసెంట్గా కల్కి సినిమా టీం చిట్ చాట్ నిర్వహించింది . ఈ చిట్ చాట్ లో ప్రభాస్ మాట్లాడిన మాటల తాలూకా వీడియో వైరల్ గా మారింది . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

ఈ క్రమంలోనే సినిమాపై హ్యూజ్ బజ్ నెలకొంది . కాగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమాను అదే స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు నాగ్ అశ్వీన్.. రిలీజ్ అయిన కొన్ని కొన్ని పిక్చర్స్ వీడియోస్ చూస్తూ ఉంటే హాలీవుడ్ ను తలదన్నే స్థాయిలో తెరకెక్కించాడు నాగ్ అశ్వీన్ ఈ సినిమాని అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్. ఇదే మూమెంట్లో ప్రభాస్ కూడా మాట్లాడుతూ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు.

“ఈ సినిమాలో నాది నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ కూడా చూస్తారు అని.. కామెడీ యాంగిల్ కూడా చూస్తారు అని ..తెలుగు జనాలకు నా కామెడీ టైమింగ్ తెలిసిన నార్త్ జనాలకు నా కామెడీ టైమింగ్ తెలియదు అని ..వాళ్ళకి నేనంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది అని చాలా చాలా హుందాగా మాట్లాడారు “. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు . నార్త్ జనాలకి కాదు నువ్వంటే ఏంటో ప్రపంచవ్యాప్తం తెలుస్తుంది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. డోంట్ వర్రీ అన్నా అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.