తేజ.. ఈ పేరు ఒకప్పుడు ఎంత మారు మ్రోగి పోయిందో మనకు తెలిసిందే. ఇప్పుడు పెద్దగా క్రేజ్ దక్కించుకోలేక పోతుంది. ఆయన తెరకెక్కించే సినిమాలు అప్పట్లో బాగా ఆడేవి .. ఇప్పుడు మాత్రం పెద్దగా జనాలు ఆకట్టుకోలేకపోతున్నాయి . కాగా తేజ మళ్ళీ టాప్ డైరెక్టర్గా మారడానికి తన వంతు కృషి చేస్తున్నాడు . రీసెంట్గా తేజకు సంబంధించిన ఒక వార్త తెలుగు సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది.
తేజ త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వెంకటేష్ డైరెక్ట్ చేయబోతున్నాడట . ఈ న్యూస్ ఇప్పుడు సినీ వర్గాలలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అసలు హిట్ లేని తేజ ఈ మధ్యకాలంలో హిట్ కొట్టలేని వెంకటేష్ ని డైరెక్టర్ చేస్తూ ఉండడం ఫ్యాన్స్ కిక్ ఇస్తుంది. అయితే ఫుల్ టూ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కబోతుందట . ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్గా త్రిష నటించబోతుందట .
గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన ఆడవారు మాటలకు అర్థాలే వేరులే లాగా.. ఈ సినిమా ఉండబోతుందట . ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అంతేకాదు.. ఈ సినిమాలో మరోక స్టార్ హీరో కూడా ఉండబోతున్నాడట. మొత్తానికి హిట్ లేని వెంకటేష్ కి హిట్ లేని డైరెక్టర్ తేజ హిట్ ఇవ్వబోతున్నాడు అనమాట..!!