మరికొద్ది నిమిషాలల్లో నాన్న ప్రమాణ స్వీకారం..అకీరా చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..!

కొద్ది నిమిషాలే ..మరికొద్ది నిమిషాలలోనే కోట్లాదిమంది పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నా మూమెంట్ రాబోతుంది. పవన్ కళ్యాణ్ కొణిదెల అనే నేను అనే మాటను పవన్ నోట వినడానికి ఎంత మంది జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం . నేడు ఏపీలో ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు . దేశవ్యాప్తంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పేర్లు మారుమ్రోగి పోతున్నాయి . ఈ వేడుకకు పీఎం మోడీతో పాటు అనేకమంది ప్రముఖులు హాజరవుతున్నారు .

పవన్ కళ్యాణ్ కూడా నేడు ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందపడుతుంది . ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభా ప్రాంగణానికి చేరుకుంది. కాగా మెగా ఫ్యామిలీ సభ్యులంతా కూడా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే చూడడానికి వెయిట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పిల్లలు అకిరా – ఆధ్యా కూడా తమ తండ్రి ప్రమాణ స్వీకారం చూడడానికి రెడీ అయ్యారు. ఆఖీరా రెడ్ కలర్ షర్ట్ వైట్ కలర్ పంచ కట్టుకోగా ..

ఆద్య పద్ధతిగా పంజాబీ డ్రెస్ వేసుకుంది .. అప్పుడే వాళ్ళ అమ్మకు కాల్ చేసి వీడియో కాల్ మాట్లాడారు. దానికి సంబంధించిన పిక్స్ ను షేర్ చేసింది రేణు దేశాయ్ .. ఆ పిక్స్ ఇప్పుడు నెట్టింత వైరల్ గా మారాయి . తండ్రి జనసేన సింబల్ ను రంగును ప్రమోట్ చేస్తూ ఎర్ర షర్ట్ వేసుకోవడం అదేవిధంగా పద్ధతిగా సాంప్రదాయంగా పంచ కట్టుకోవడం పవన్ ఫ్యాన్స్ ఫిదా చేసేసింది. అకిరా చేసిన ఆ ఒక్క పని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!!