బిగ్ షాకింగ్: షూటింగ్ కు వెళ్తూ ‘జబర్దస్త్ ‘ ఆర్టిస్ట్ మృతి..!!

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ మరణించిన వార్తలు ఎక్కువగా వింటున్నాం . ఒక స్టార్ సెలబ్రిటీ మరణించాడు అన్న వార్త విని ఆ విషాద ఛాయలు మరవకముందే మరొక మరణ వార్త వినాల్సి వస్తుండడం ఫ్యాన్స్ కి తీవ్ర శోకసంద్రంలో నింపేస్తుంది. అయితే రీసెంట్ గా జబర్దస్త్ ఆర్టిస్టు మృతి చెందాడు అన్న వార్త సినీ వర్గాలలో సోషల్ మీడియాలలో వైరల్ గా మారింది . జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పాపులారిటీ సంపాదించుకున్నారు . లైఫ్ సెటిల్ చేసుకున్నారు . అదే లిస్టులోకి వస్తాడు ఈ మహమ్మద్దీన్ .

జబర్దస్త్ ఆర్టిస్ట్ మహమ్మదీన్ ప్రమాదవశాత్తు రైలు ఎక్కుతూ కింద జారిపడి మరణించాడు . ఇప్పుడు ఈ న్యూస్ ఫ్యాన్స్ కు జీర్ణించుకోలేని స్థితిని క్రియేట్ చేసింది . భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ దారుణం జరిగింది . కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు జబర్దస్త్ ఆర్టిస్ట్ మహమ్మదీన్. రైలు పట్టాల మధ్య ఇరుక్కుని కాసేపు నరకం చూశారు. వెంటనే గమనించిన జనాలు ట్రైన్ చైన్ లాగి ఆయనను ఆ పట్టాల మధ్య నుంచి బయటకు తీయడానికి చాలా చాలా కష్టపడ్డారు .

అప్పటికే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహమ్మదీన్ ను వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లారు . టెస్టులు చేసిన డాక్టర్లు నడుము పక్కటెముకల భాగం తీవ్రంగా దెబ్బతిన్నాయి అని.. వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలి ఖమ్మం తరలించాలి అని సూచించారు అయితే ఆయనను ఖమ్మం తీసుకెళ్లే లోపే మహమ్మదీన్ తుది శ్వాస విడి చేశారు . దీంతో ఫాన్స్ కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు. డెడ్ బాడీని సర్వజన ఆస్పత్రికి తరలించారు అక్కడ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ కంప్లైంట్ తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!