ఎస్.. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది . జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ దేవర అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది అంటూ కొరటాల శివ ఎప్పుడో ప్రకటించాడు . అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం దేవర 2 సినిమా ఆలస్యం కాబోతుందట .
కొన్ని అనివార్య కారణాల చేత ఎన్టీఆర్ వేరే సినిమాలకు కమిట్ అయిన సందర్భంగా దేవర2 ఆలస్యంగా సెట్స్ పైకి రాబోతుందట . నిజానికి కొరటాల శివ అనుకున్న ప్లాన్ ప్రకారం దేవర వన్ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే దేవర 2 ని సెట్స్ పైకి తీసుకురావాలి. అయితే దేవర2 మరింత ఆలస్యం కాబోతుందట . ఈలోపు వార్ 2 సినిమా అదేవిధంగా ప్రశాంత నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయబోతున్నాడట ఎన్టీఆర్ . దీంతో ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ మెంట్ అవుతున్నారు.
ఇలాంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయితేనే బాగుంటాయి అని ..ఒక సినిమా రిలీజ్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత మరొక సినిమా రిలీజ్ అయితే జనాలలో ఆ ఫీలింగ్ పోతుంది అని.. అంత క్రేజ్ ఉండదు అని టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్. చూద్దాం మరి తారక్ -కొరటాల శివ ఏ నిర్ణయం తీసుకుంటారో..?? ప్రసెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!