అమ్మ బాబోయ్ ఈ రాజమౌళి మామూలోడు కాదుగా.. సైలెంట్ గానే ఆ హీరోయిన్ కి స్కెచ్ వేసాడా..?

రాజమౌళి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్. సినిమాలను ఏ డైరెక్టర్ అయిన తెరకెక్కిస్తాడు . కానీ జనాలను అర్థం చేసుకొని వాళ్ళ నాడి పట్టుకున్న రేంజ్ లో సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ మన ఇండస్ట్రీలో చాలా చాలా తక్కువ . ఆ లిస్టులోకే వచ్చేస్తాడు రాజమౌళి. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు .. అంటే రీజన్ మాత్రం ఆయన డెడికేషన్ అని చెప్పాలి .

ఒక సీన్ షూట్ చేయాలన్నా సరే ఒకటికి పది సార్లు ఆలోచిస్తాడు రాజమౌళి . అలాంటిది తన సినిమాలో ఒక అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకోవాలి అంటే ఎన్నిసార్లు ఆలోచిస్తాడు.. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు తో ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాలి కానీ మహేష్ బాబు లుక్స్ పై సాటిస్ఫై అవ్వని రాజమౌళి సినిమాను వాయిదా పై వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు .

అయితే సినిమాలో నటించే ప్రతి క్యారెక్టర్ విషయంలో రాజమౌళి చాలా చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారట. ఈ క్రమంలోనే సినిమాలో కేవలం ఐదు నిమిషాలు కనిపించే పాత్ర కోసం మలయాళీ బ్యూటీ మమిత బైజును చూస్ చేసుకున్నారట . ప్రేమలు సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న మమిత బైజుపై రాజమౌళి గతంలో చేసిన కామెంట్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి . ఆమె నటనకు ఫిదా అయిపోయాడు .. అలాంటి బ్యూటీని తన సినిమాలో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు రాజమౌళి . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు . కేవలం ఐదు నిమిషాల పాత్ర కోసం అంత పెద్ద హీరోయిన్ చూస్ చేసుకున్నావా..? నీ టాలెంట్ కి ఫిదా అయిపోయాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు..!