దాదాపు 18 ఏళ్ల తరువాత..ప్రభాస్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం .. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు గెస్ చేయలేరు . ఇది జరుగుతుంది అని అనుకునే లోపే అది జరగకుండా అయిపోతుంది. కాగా చాలామంది స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు తమ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు . తమదైన స్టైల్ లో దూసుకుపోతున్నారు . కాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన .

హీరోయిన్ శోభన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. ఆమె అందం ..ఆమె నటన.. ఆమె వాక్యాతుర్యం ఎప్పటికీ మర్చిపోలేము . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శోభన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా ద్వారా తన తెలుగు రీఎంట్రిని ఫిక్స్ చేసుకుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. తాజాగా మరియం అనే పాత్రకు సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు కల్కి మూవీ మేకర్స్ .

ఈ పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన నటిస్తున్నట్లు అధికారికంగా రివిల్ అయింది. వైజయంతి మూవీ మేకర్స్ వారు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా “ఆమెలాగే తన పూర్వికులు కూడా ఎదురు చూశారు” అనే క్యాప్షన్ జత చేశారు. ఇంకో ఎయిట్ డేస్ వెయిట్ చేయండి అంటూ హైప్ క్రియేట్ చేశారు . కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీ రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు..!!