మెగాడాటర్ శ్రీజ మాజీ భర్త మృతి.. శ్రీరెడ్డి సంచలన పోస్ట్ వైరల్..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. శ్రీజ పేరు మారుమ్రోగిపోతుంది . మొదటినుంచి మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్కి గురవుతూనే ఉంటుంది. అది మనకు తెలిసిందే. దానికి కారణం కూడా మనకు తెలుసు . రెండు పెళ్లిళ్లు చేసుకుని రెండుసార్లు విడాకులు ఇచ్చేసింది. అయితే శ్రీజ మొదట పెళ్లి చేసుకున్న శిరీష్ భరద్వాజ్ నేడు ఉదయం మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

ఆయన తన అనారోగ్య కారణంగా మరణించినట్లు తెలుస్తుంది . లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ కావడంతో ఊపిరితిత్తుల సమస్య వల్ల ఆయన హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ వచ్చారట . ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . అయితే శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మరణించాడు అని తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు . ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని ప్రార్థిస్తున్నారు . అయితే సోషల్ మీడియాలో తాజాగా శ్రీరెడ్డి చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

శ్రీ రెడ్డి శిరీష్ భరద్వాజ్ మరణం పై స్పందిస్తూ సెన్సేషనల్ పోస్ట్ షేర్ చేసింది . ఆమె తన అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ.. శ్రీజ తో శిరీష్ కలిసున్న ఫోటోను షేర్ చేసింది . “చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఇకలేరు ..ఇప్పటికైనా నీకు శాంతి దొరికింది రా శిరీష్,, అందరూ నిన్ను మోసం చేసేసారుగా” అంటూ రాస్కొచ్చింది . శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ సెకండ్స్ లోనే వైరల్ గా మారింది . కేవలం శ్రీరెడ్డినే కాదు చాలామంది ఒపీనియన్ కూడా ఇదే ..శిరీష్ భరద్వాజ్ మరణించడానికి పరోక్షకంగా మెగా ఫ్యామిలీ కూడా కారణమంటూ సోషల్ మీడియాలో మెగా హెటర్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు..!!