పవర్ స్టార్ ఫ్యాన్స్ కిక్ ఇచ్చే న్యూస్.. ‘ ఓజీ ‘ లేటెస్ట్ అప్డేట్ వైరల్.. ?!

పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది తాజాగా అంతకుమించిన అప్డేట్ రానే వచ్చింది. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సుజిత్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. అసలు ఓజీ షూటింగ్ వివరాలు ఏంటో.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ట్రైలర్ కట్ ఎలా ఉందో.. దానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను డైరెక్టర్ చెప్పుకొచ్చాడు.

Pawan Kalyan Holics™ on X: "Edit 🌋🔥 #OG #TheyCallHimOG @PawanKalyan  https://t.co/AKvaRfmNcu" / X

ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నా అందరి ఫోకస్ ఓజీ పైనే ఉందంటూ చెప్పిన సుజిత్.. ఎందుకంటే అందులో పవన్ లుక్, టీజర్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. అయితే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న ఒరిజినల్ సినిమా ఇది అంటూ చెప్పుకొచ్చాడు సుజిత్. టీజర్ రిలీజ్ ద‌గ్గ‌ర నుంచే దీనిపై అంచనాలు భారీగా మొదలయ్యాయి. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ 70% పూర్తయింది అంటూ వివరించాడు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో మిగతా సినిమా పూర్తి కాలేదని.. అయితే మరో రెండు వారాలు పవన్ తన డేట్స్ ఇస్తే సినిమా పూర్తి అయిపోతుందని వివరించాడు.

Trailer for Pawan Kalyan's "OG" Ready for Release - businessoftollywood

చిన్ని అప్డేట్ వస్తే చాలు అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఈ న్యూస్ తో ఫుల్ మీల్స్ పెట్టినట్లు అయింది. టైటిల్ లోనే జాపనీస్ లింక్ చూపిస్తూ ఉత్కంఠ రేపిన సుజిత్.. ఇప్పుడు దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఓజీలో జపనీస్ రిఫరెన్స్ లు ఉంటాయని.. కొన్ని యాక్షన్ సన్నీ వేశాలు పవన్ స్వయంగా దగ్గరుండి డిజైన్ చేయించాడని చెప్పుకొచ్చాడు. ట్రైలర్ ఇప్పటికే కట్ చేసామని.. రిలీజ్‌కు ముందు ట్రైల‌ర్ రిలీజ్ చేయనున్నట్లు వివరించాడు. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.