అక్కినేని హీరో.. యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా తండేల్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రలో చైతన్య నటిస్తున్నారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని వివరించారు డైరెక్టర్ చందు మొండేటి. ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా కనిపించనుంది. మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. భారీ బడ్జెట్ తో తండేలు మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య.. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.
ప్రస్తుతం ఓటీటీ సినిమాల హవా నడుస్తుంది. ఇలాంటి క్రమంలో భారీ విజువల్స్ ఉండే సినిమాలకు మాత్రమే థియేటర్లకు వచ్చి ప్రేక్షకులు చూస్తారని.. నాగచైతన్య వివరించాడు. అయితే మార్కెట్ కోసమే భారీ విజువల్ సినిమాల్లో పెట్టకూడదంటూ చెప్పిన ఆయన ప్రాజెక్ట్ను బట్టి అది నాచురల్ గా ఉండాలంటూ వివరించాడు. ఈ ఓటీటీ టైంలో ఎక్కువ లైఫ్ విజువల్స్ ఉండే భారీ సినిమాలే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయని.. అలాగని మార్కెట్ అవసరాల కారణంగా భారీ విజువల్స్ సింపుల్ గా పెట్టలేమంటూ చెప్పుకొచ్చాడు. ప్రాజెక్ట్ అవసరానికి అనుకూలంగా కంటెంట్కు తగ్గట్టు ముఖ్యంగా పాత్రకు అనుకూలంగా ఉండేలా ఉండాలంటూ వివరించాడు.
ఇది తన కెరీర్ లోనే భారీ మూవీ అని చెప్పిన ఆయన.. షూటింగ్ ముందే 9 నెలలు ట్రైనింగ్ తీసుకున్నట్లు వివరించాడు. ఈ సినిమాలో పాత్ర తనకు ఎంతో అవసరమని వివరించాడు. ముఖ్యంగా శ్రీకాకుళం యాసలో అన్నీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలనుకున్నానని.. దీనికోసం 9 నెలలు కష్టపడినట్లు ఆయన వివరించాడు. ప్రస్తుతం నాగచైతన్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక గతంలో నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో లవ్ స్టోరీ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో.. వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.