ఓర్నీ.. హీరోయిన్ లయలో ఈ స్పెషల్ టాలెంట్ కూడా ఉందా.. ఇప్పటికీ ఏడు సార్లు నేషనల్ లెవెల్ లో..?!

స్వయంవరం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది లయ. అప్పట్లో అందం, వినోదంతో కోట్లాదిమంది ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ అమ్మడు.. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ లోను మంచి పాపులారిటీ దక్కించుకుంది. తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో వరుసగా నంది అవార్డులను దక్కించుకుంది. హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో మెప్పించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో 40 కి పైగా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ 2006 లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేష్‌ను వివాహం చేసుకొని సినిమాలకు చెక్ పెట్టి అమెరికాలో సెట్టిల్ అయ్యింది.

Alitho Saradaga Season 2 | Episode 10 Promo | with Actress Laya | Watch it  on ETV

వీరికి ఓ పాప, బాబు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇన్నాళ్లు అమెరికాలో ఉన్న ఈ అమ్మడు తాజాగా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. గత కొంతకాలంగా డ్యాన్స్ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న లయా.. తాజాగా అలీతో సరదాగా ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఇండస్ట్రీ లోకి రావడానికి తన తల్లిదండ్రులే కారణం అని.. స్టార్ట్ 2000 కాంటెస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూసి తనకు ఇష్టం లేకుండా తన తల్లిదండ్రులు ఆమె ఫోటోలు షేర్ చేశారని.. అందులో సెకండ్ వచ్చానని.. ఆ ఈవెంట్లో స్వయంవరం యూనిట్ నన్ను చూసి అవకాశం ఇచ్చారంటూ వివరించింది.

నితిన్ మూవీతో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ.. ఏ రోల్ చేస్తుందో తెలిస్తే!  | Laya Plays Nithin Sister Role In THAMMUDU Movie - Telugu Filmibeat

అయితే ఈమెలో ఉన్న ఓ స్పెష‌ల్ టెలెంట్‌ను కూడా రివీల్ చేసింది లయ. తను చెస్ చాంపియన్ అనే విషయాన్ని వివ‌రించింది. కోనేరు హంపి వాళ్ళ నాన్న దగ్గర చెస్‌ నేర్చుకున్నానని.. దాదాపు ఏడుసార్లు నేషనల్ కు వెళ్లాలని వివరించింది. కానీ ఒక్కసారి మాత్రమే గెలిచానంటూ చెప్పుకొచ్చింది. ఇన్నాళ్లు కేవలం హీరోయిన్గా టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్‌గా మాత్ర‌మే పరిచయం ఉన్న లయలో.. ఈస్పెషల్ టాలెంట్ కూడా ఉందని తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఇక‌ ప్రస్తుతం లయ తెలుగులో ఓ సినిమాలో నటిస్తుంది. నితిన్ హీరోగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న‌ తమ్ముడు సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తున్నారు.