ప్రభాస్ కూడా ఆ లిస్ట్ లోకి యాడ్ అయిపోయాడా..? వాట్ ఈజ్ దిస్ డార్లింగ్..!

కొంప ముంచేసావు కదా డార్లింగ్ ..నువ్వు కూడా ఇలాంటి పనులు చేస్తావా .. నిన్ను నమ్మి మోసపోయాం డార్లింగ్..ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రతి సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కేలా చూసుకుంటున్నాడు. ప్రజెంట్ ఆయన నటించిన కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం భారీ స్థాయిలో కష్టపడుతున్నాడు ప్రభాస్.

అయితే ప్రభాస్ రీసెంట్గా స్పెషల్ పర్సన్ నా లైఫ్ లోకి రాబోతున్నారు వెయిట్ చేయండి డార్లింగ్ అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్టు చూసిన అందరూ పెళ్లి గురించి అంటూ బాగా చర్చించుకున్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు ..అనుష్క నే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ బాగా ప్రచారం జరిగింది . అనుష్క కాదు తన పెళ్లి గురించి కాదు.. అది సినిమా ప్రమోషన్స్ కోసం అంటూ తాజా పోస్ట్ తో క్లారిటీ వచ్చింది.

ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు ఓ మెషిన్ ఉంటుందట . దాని పేరు బుజ్జి అంటూ తెలుస్తుంది. సదరు బుజ్జిని రేపు అనగా శనివారం సాయంత్రం ఐదు గంటలకు పరిచయం చేయబోతున్నట్లు తెలియజేశారు. ఆ బుజ్జి గురించి ప్రభాస్ పెట్టిన పోస్ట్ అంటూ క్లారిటీ వచ్చింది . దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ పెళ్లి వార్తపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న జనాలు మండిపడుతున్నారు . అంతేకాదు సినిమా ప్రమోషన్స్ కోసం నువ్వు కూడా ఇలాంటి పనులు చేస్తావా ..?డార్లింగ్ అంటూ ఫైర్ అవుతున్నారు..!!