రాత్రి పడుకునే సమయంలో అక్కడ నొప్పి వస్తుందా..? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే..!

చాలామందికి ఒక అలవాటు ఉంటుంది ..తినినా వెంటనే పడుకునేస్తారు . చెయ్యి కూడా ఆరకముందే బెడ్ ఎక్కేస్తారు. అది చాలా చాలా తప్పు ..టూ డేంజర్ కూడా.. ఎందుకంటే మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి అంటే కచ్చితంగా టైం పడుతుంది. అలా కాకుండా ఫుడ్ తినిన వెంటనే .. పడుకునేస్తే.. ఫుడ్ డైజెస్ట్ లేట్ అవ్వడం ..అదేవిధంగా మరికొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వస్తూ ఉంటాయట.

గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయట . అంతేకాదు మరి ముఖ్యంగా వయసు అయిపోయిన వాళ్ళు లేట్ నైట్ ఫుడ్స్ తినినే తినకూడదట . యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా త్వరగా తినేసి బాగా వాక్ చేసి ఆ తర్వాత నిద్రపోవడం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే చాలామంది వెంటనే పడుకునేస్తూ ఉంటారు . ఆ సమయంలో వాళ్ళకి గ్యాస్ పైకి ఎగతన్నుతూ ఉంటాది.

కొన్ని కొన్ని సార్లు ఊపిరి కూడా ఆడకుండా ఉండే సమస్యలు కూడా వస్తాయి. కొన్నిసార్లు గుండెల్లో పట్టేసినట్టు నొప్పి కూడా వస్తూ ఉంటుంది . మరి కొన్నిసార్లు గొంతులో మంట కూడా వస్తూ ఉంటుంది . ఇది సాధారణమే అని లైట్ గా తీసుకుంటే డేంజర్ లో ఉన్నట్లే ..వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకోవడం మంచిది అంటున్నారు డాక్టర్లు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది..కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అన్ని సెట్ అవుతాయి..!!