పుష్ప 2 సాంగ్ ప్రోమో లో బిగ్ మిస్టేక్..సుకుమార్ అడ్డంగా దొరికిపోయాడుగా(వీడియో)..!

పుష్ప ..పుష్ప రాజ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా ..? గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తున్న పేరు. మరీ ముఖ్యంగా బన్నీ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటీంచడం సినిమాకి హైలెట్ గా మారింది . అంతేనా కోట్లాదిమంది ఇండియన్స్ ఎదురుచూసిన ఉత్తమ జాతియ నటుడి అవార్డు కూడా ఫస్ట్ టైం బన్నీ ఖాతాలో వచ్చి చేరింది. ఈ రేర్ మూమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేరు బన్నీ అభిమానులు .కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్ . ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప అంటూ రిలీజ్ చేశారు. ఇది కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న మరి కొంతమంది ని మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

అయితే తాజాగా శ్రీవల్లికి సంబంధించిన ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు . నేడు ఆ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు . ఈ సాంగ్ ప్రోమో ఆధారంగా ఇది పుష్ప వన్ లోని సామీపాటకు ఇంచుమించుగా అలాగే ఉండబోతున్నట్లు తెలుస్తుంది . అయితే పుష్ప వన్ సాంగ్ విషయంలో మాత్రం బాగా కేర్ఫుల్ గా స్టెప్స్ తీసుకున్న సుకుమార్ పుష్ప2 విషయంలో మాత్రం అలాంటి ఒక నిర్ణయం తీసుకోలేదు అంటూ టాక్ వినబడుతుంది . ఎందుకంటే పుష్ప వన్ లోని సామి పాటకు అదే బీట్ తో ఈ సాంగ్ నీ కంపోజ్ చేసినట్లు రష్మిక వేసిన స్టెప్స్ ఆధారంగా తెలుస్తుంది.

ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఈ సాంగ్ కచ్చితంగా హిట్ అవుతుంది . కానీ అభిమామానులు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి మాత్రం వెళ్ళలేదు అని సుకుమార్ బన్నీ కాంబోలో వచ్చే పుష్ప 2 పై కొత్తదనాన్ని జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . ప్రజెంట్ ఈ సాంగ్ కి సంబంధించిన కొన్ని క్లిప్స్ నెట్టింట వైరల్ గా మారాయి . చూద్దాం మరి సుకుమార్ తాను చేసిన తప్పును ఏ విధంగా సరిదిద్దుకోబోతున్నాడో..??