సినిమాని తెరకెక్కించడం కాదు.. ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవడం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అది ఎలాంటి హీరోలకైనా సరే పెద్ద పెద్ద తోపైన హీరోలు కూడా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి దొంగదారులు వెతుక్కుంటున్నారు . అంతెందుకు మన డార్లింగ్ ప్రభాస్ కూడా నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ఒక పోస్ట్ పెట్టి తీరా అది కల్కి సినిమాలోని బుజ్జి అంటూ బిగ్ బాంబ్ పేల్చాడు . అఫ్ కోర్స్ కల్కి ప్రాజెక్ట్ అప్డేట్ బాగా అభిమానులకి నచ్చడంతో ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు.
తాజాగా ఆనంద్ దేవరకొండ తన సినిమా కోసం టాటూ వేయించుకున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . విజయ్ దేవరకొండ బ్రదర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ .. ప్రజెంట్ చేస్తున్న మూవీ గం గం గణేశా. రీసెంట్గా ఈ ట్రైలర్ రిలీజ్ అయింది . మే 31వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ . ట్రైలర్ చాలా చాలా ఆకట్టుకుంటుంది . ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆనంద్ దేవరకొండ మెడ పై చైనీస్ భాషలో టాటూ ఉన్నట్లు చూపించారు. అయితే అది ఏ అమ్మాయిని కలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కలిసిన ఎవ్వరికి చైనీస్ భాష రాదు కాబట్టి తన పేరే వేయించుకున్నాను అని కామెడీగా చెప్పేవారట .
ట్రైలర్ లో ఈ టాటూ సీన్ బాగానే పండింది . ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆనంద్ మాట్లాడుతూ ..ఈ టాటూ గురించి ఓపెన్ అప్పయ్యాడు.. “రెండేళ్ల క్రితం ఈ సినిమా మొదలైనప్పుడు ఒక టాటూ ఉండాలి అని.. వెతికి ఇది సెలెక్ట్ చేశాడు .. డైరెక్టర్ చైనా భాషలో దీన్ని గూగుల్ లో డీకోడ్ చేస్తే ఫ్యామిలీ అని వచ్చింది .. మీరంతా నా ఫ్యామిలీని అందుకే ఇలా ఫ్యామిలీ అనే టాటూ తీసుకున్నాం “అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ టాటూ కేవలం స్టిక్కర్ అని టెంపరరి అని..పర్మినెంట్ కాదు అని తెలుస్తుంది. సినిమా కోసమే ఇలా ప్రమోషన్స్ పనుల్లో ఈ టాటూ ని బయటపెట్టాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఆనంద్ దేవరకొండ నటించిన ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో..??