తారక్ చిన్న వయసులోనే యాక్షన్ సినిమాల్లో అదరగొట్టడం వెనుక అసలు సీక్రెట్ ఇదే..?!

నందమూరి కుటుంబం నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తనదైన స్టైల్‌లో సినిమాలు నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తారక్ కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా మాస్, యాక్షన్ సినిమాల్లో నటిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో అప్పట్లో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఓపెన్ సంచలనంగా మారిందనడంలో సందేహం లేదు. ఇక వాటిలోనూ ఆది, సింహాద్రి సినిమాలతో అయితే ఆయ‌ను ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా మార్చేశాయి. ఈ సినిమాలు ఇచ్చిన సక్సెస్ తో తాను ఎక్కడ తగ్గకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోయాడు. ఇందులో భాగంగానే ఎన్నో వైవిధ్యమైన క‌థ‌లు ఎంచుకుంటూ నటించాడు.

Aadi (2002) - IMDb

అయితే ఇండస్ట్రీ లోకి అడగపెట్టేటప్పటికీ తారక్‌ వయసు చాలా తక్కువ. అయినా అంత చిన్న వయసులోనే తను మాస్ హీరోగా సినిమాలలో నటించడానికి గ‌ల అసలు సీక్రెట్ ఇదేనంటూ ప్రస్తుతం ఓ వార్త వైరల్‌గా మారింది. తారక్ మొదట్లో హీరోగా మాస్‌ సినిమాలను నటించడానికి గల కారణం వల్ల బాబాయ్ బాలకృష్ణ అట‌. అప్పటికే వరుస యాక్షన్ సినిమాల‌లో న‌టిస్తూ మాస్ ఆడియన్స్ వ‌ద్ద‌ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడమే.. తార‌క్ యాక్ష‌న్ సినిమాలు నటించ‌డానికి కార‌ణం అట‌. తను కూడా అదే మాదిరిగా మాస్ ఫాన్స్ లో గుర్తింపు తెచ్చుకోవాలని ప్లాన్ చేసిన తార‌క్‌.. ఆ ఉద్దేశంతోనే వరుసగా మాస్ యాక్షన్ సినిమాల్లో నటిస్తూ సక్సెస్ సాధించాడు.

Pin by Chintamaneni Shanmukhchowdary on ntr | New movie images, New images hd, New photos hd

మొత్తానికి తనకు తాను స్టార్ హీరోగా మలుచుకున్నాడు. తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలో చూజ్‌ చేసుకోలేకపోయాడు. తర్వాత వచ్చిన దాదాపు అన్ని సినిమాలలోను నటించి కొంతకాలం భారీ ఫ్లాప్‌ల‌ను ఎదుర్కొన్నాడు. దీంతో మార్కెట్ బాగా డౌన్ అయింది. ఇలాంటి నేపథ్యంలో తనకంటూ స్ట్రాటజీని మెయింటెన్ చేస్తూ వైవిధ్యమైన దారిలో కథలను ఎంచుకోవడం మొదలుపెట్టాడు. దానివల్ల ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఫ్యూచర్ లో ఇంతకు మించిన భారీ సక్సెస్ లను అందుకుంటూ తారక్‌ ముందుకు వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు.