నా ఫస్ట్ లవ్ ఆ హీరోయినే.. అందుకే బ్రేకప్.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ షాకింగ్ కామెంట్స్.. !!

కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ గా భారీ పాపులారిటి ద‌క్కించుకున్నాడు అనిరుధ్‌ రవిచంద్రన్. రెహమాన్ శిష్యుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిరుధ్‌ అతి తక్కువ టైంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా సంచలనాలు సృష్టించాడు. చాలా చిన్న వయసులోనే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. హీరో ధనుష్ అనిరుధ్‌ను తన సినిమాల ద్వారా పరిచయం చేస్తే.. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా కోలీవుడ్‌లో విజయ్‌, అజిత్, రజినీ లాంటి టాప్ స్టార్ హీరోలు అందరి సినిమాలకు సంగీతం అందించిన ఆయ‌న తెలుగులో కూడా పలు సినిమాలకు పని చేస్తున్నాడు. తెలుగు, తమిళ తో పాటు హిందీ లాంటి భాషల్లో కూడా తన కెరీర్ కొనసాగిస్తున్న అనిరుధ్‌.. ప్రస్తుతం కమలహాసన్, రజనీకాంత్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో పనిచేస్తూ బిజీగా ఉన్నాడు.

అయితే ఈ రేంజ్ లో పాపులారిటి దక్కించుకున్న అనిరుధ్ కెరీర్‌లో అదే రేంజ్‌లో కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాక్ స్టార్ గా మారిన అనిరుధ్ గ‌తంలో కొంతకాలం పాటుపలు వివాదాల్లో చిక్కుకుపోయాడు. మరి ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ బ్యూటీ ఆండ్రియ ప్రేమ వ్యవహారం గురించి ఆయన ఎన్నో తలనొప్పులను ఫేస్ చేశాడు. ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతున్న టైంలో సుచీ లిక్స్ ద్వారా వీరిద్దరి క్లోజ్ లిప్ లాక్ ఫోటో ఒకటి వైరల్ అయింది. అప్పట్లో ఈ న్యూస్ కోలీవుడ్‌ సెన్సేషన్‌గా మారింది. తర్వాత ఇద్దరు బ్రేకప్ చేసుకున్నారు. అయితే ఇప్పటికీ వివాదం అనిరుధ్‌ను వెంటాడుతూనే ఉండడంతో.. తాజాగా అనిరుధ్‌ ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. ఆయనకు మీరు ప్రేమించిన నటి ఎవరు.. ఆమె పేరు.. మీ లవ్ ఫెయిల్యూర్ కు కారణం ఏంటి.. అనే ప్రశ్న ఎదురైంది.

దీంతో అనిరుధ్ మాట్లాడుతూ నా ప్రియురాలు పేరు ఆండ్రియా అంటూ వివరించాడు. నేను 19 సంవత్సరాల వయసులోనే ప్రేమలో పడ్డానని.. నా మొదటి ప్రేమ కూడా ఆమె అంటూ చెప్పుకొచ్చాడు. ఆమె వయసు 25 ఏళ్ల అంటూ కామెంట్స్ చేసిన అనిరుధ్‌ నా లవ్ ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం మా ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడా అంటూ వివరించాడు. నాకంటే ఆమె ఆరేళ్లు పెద్దది. అదే మా ప్రేమకు శాపంగా మారింది అంటూ అనిరుధ్‌ వివరించాడంటూ తమిళ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక చివరిగా రజనీకాంత్ జైలర్ సినిమాతో సంచలనం సృష్టించిన అనిరుధ్‌.. ఈ సినిమాకు వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. ఈ క్రమంలో ఈయనకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస ఆఫర్లు కడుతున్నాయి.