రజనీకాంత్ కూతురిగా నటించనున్న ఆ స్టార్ హీరోయిన్.. అసలు ఊహించలేరు..?!

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం తన 170 సినిమా వెట్టయాన్ మూవీ షూటింగ్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత లోకేష్ కనగ‌రాజ్‌ డైరెక్షన్లో తన 171వ‌ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు రజిని. ఈ నేపథ్యంలో తన 171వ సినిమాల్లో రజనీకు కూతురిగా ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె స్టార్ హీరోయినే కాదు.. ఓ స్టార్ కిడ్ కూడా ఇంతకీ ఆమె ఎవరు.. అసలు విషయం ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. సూపర్ స్టార్ రజినీకాంత్ 171వ సినిమాలో విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలు శృతిహాసన్ నటించనుందని.. రజనీకాంత్ కూతురుగా ఈ అమ్మడు మెప్పించబోతుందని తెలుస్తుంది.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కునున్న‌ ఈ సినిమాకు కళుగు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈనెల 22న సినిమా టైటిల్, టీజర్ ను అఫీషియల్ గా రిలీజ్ చేస్తారని దర్శకుడు లోకేష్ కనగ‌రాజ్‌ వివరించారు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. తాజాగా ఇందులో రజనీకాంత్ కూతురుగా శృతిహాసన్ నటించనుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ సినీ దట్ట‌జాలలో కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరు ఒక‌రికొక్క‌రు గ‌ట్టీపోటీ పడుతూ ఉంటారు. వీరిద్దరూ కలిసి కూడా ప‌లు సినిమాల‌లో నటించారు. అయితే ఈ కాంబో మూవీ వ‌చ్చి దాదాపు 25 ఏళ్ళు అవుతుంది.

అలాంటిది ఇప్పుడు కమలహాసన్ కూతురు.. రజినీకాంత్ తాజా సినిమాల్లో నటించడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ంతేకాదు శృతిహాసన్ తమిళ్‌లో నటించి చాలా కాలం అయిపోయింది. లాభం సినిమా తరువాత ఈమె ఒక్క తమిళ్ మూవీ లో కూడా నటించలేదు. కాగా సుమారు మూడేళ్ల తర్వాత ఈ బ్యూటీ మరోసారి రజనీకాంత్ కూతురుగా కోలీవుడ్ లో నటించే ఛాన్స్ అందుకుంది. అయితే ఇటీవల తండ్రి కమల్ హాసన్ రాసి, రూపొందించిన ఎనిమోల్ సినిమా ఆల్బమ్ లో దర్శకుడు లోకేష్ కనగ‌రాజ్‌తో కలిసి పని చేసింది శృతిహాసన్. దీంతో రజినీకాంత్ లోకేష్ కనగ‌రాజ్‌ కాంబోలో శృతిహాసన్ కూతురుగా ఫిక్స్ అయిందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనిపై త్వ‌ర‌లోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట.