ఫ్యాన్స్ కి సైలెంట్ షాక్ ఇచ్చిన తెలుగు హీరోయిన్.. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసేసుకుందిరోయ్..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ గుట్టు చప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ వాళ్ళ పెళ్లి విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. తీరా మూడు ముళ్ళు వేశాక వెడ్డింగ్ ఫొటోస్ షేర్ చేస్తున్నారు . ఇలా చాలామంది స్టార్ సెలబ్రెటీస్ చేశారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది తెలుగు హీరోయిన్.

ఎస్ తెలుగు అమ్మాయి అపూర్వ శ్రీనివాసన్ రీసెంట్గా పెళ్లి చేసుకుంది . సోషల్ మీడియాలో ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ గా మారాయి. టెంపర్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది ఈ అందాల ముద్దుగుమ్మ. తెలుగు అమ్మాయి అపూర్వ శ్రీనివాసన్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించింది . జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, విన్నర్ , తొలిప్రేమ, కవచం, ప్రేమకథా చిత్రం 2 లాంటి మంచి సినిమాలలో కీలకపాత్రలను పోషించి స్పెషల్ క్రేజీ స్థానాన్ని దక్కించుకుంది .

రీసెంట్ గా శ్రేయ శివకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది . తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది . కేవలం కుటుంబ సభ్యులు అత్యంత దగ్గర సన్నిహితుల మధ్య చాలా సింపుల్ గా ట్రెడిషనల్ గా పూర్తి సాంప్రదాయ బద్దంగా పెళ్లి చేసుకుంది. అపూర్వ శ్రీనివాసన్ ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . పలువురు ప్రముఖులు నెటిజన్స్ సినీ స్టార్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పెళ్లికి నటి సిమ్రాన్ చౌదరి కూడా హాజరు కావడం గమనార్హం..!!