కలబందను ఈ విధంగా వాడి మీ ఫేస్ పై ఉన్న నల్ల మచ్చలకు చెక్ పెట్టండి..!

కలబందను ఆలోయిన్ అనే సమ్మ ళనం ఉంటుంది. ఇది మోల నిన్ను విచ్చిన్నం చేయటంలో సహాయపడుతుంది. దీంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. తాజా కలబందను తీసుకోవాలి. కలబంద నుంచి జెల్ ను తీసి ఒక గిన్నెలో ఉంచుకోవాలి.

కలబంద జెల్ అప్లై చేయటానికి ముందు ముఖాన్ని నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అనంతరం ఈ కలబంద జల్ ను లేయర్ లా అప్లై చేసుకోవాలి. ఉదయాన్నే వాష్ చేసుకుంటే చర్మం మెరుస్తుంది. స్వచ్ఛమైన తేనె, దాల్చిన చెక్క పొడిని తీసుకుని అలోవేరా జెల్ లో మిక్స్ చేయాలి.

ఈ విషమాన్ని ఫేస్ ప్యాక్ రూపంలో అప్లై చేసుకుంటే చర్మం అందంగా కనిపిస్తుంది. కొబ్బరి నూనెలో కలబంద జెల్, చక్కెర కలిపి ముఖానికి అప్లై చేస్తే నల్ల మచ్చలు మాయం అవుతాయి. మిష్టమం చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. కలబంద జెల్ ను చర్మానికి అప్లై చేసుకుంటే చర్మం నిత్యం హైడ్రేటేగా ఉంటుంది. కలబందలోని గుణాలు చర్మం తేమను నిలుపుకోవటంలో సహాయపడతాయి.