ఇంట్లో నుండి కాళ్లు బయట పెడితే..ఎన్టీఆర్ బ్యాగ్ లో అది ఉండాల్సిందేనా..? ఇదేం పిచ్చి బ్రో..!

ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది . మరీ ముఖ్యంగా కొంతమందికి బయటకు వెళ్ళేటప్పుడు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫుడ్ ని ప్యాక్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. కొంతమంది స్నాక్స్ ను స్టోర్ చేసుకొని వెళుతూ ఉంటారు. కొంతమంది టైంపాస్ కోసం ఇండోర్ గేమ్స్ ను ఆడుకునే విధంగా సెట్ చేసుకొని వెళుతూ ఉంటారు . ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఒక్కొక్క కోరికలు ఉంటాయి . అయితే మన తారక్ మాత్రం చాలా చాలా డిఫరెంట్ .

ఇంటి నుండి బయటకు వెళ్తూ ఉంటే సరే ఆయన బ్యాగ్ లో కచ్చితంగా ఇది ఉండాల్సిందే.. ఇది లేకపోతే అసలు ఆయన కాళ్లు బయట పెట్టడు అనుకోండి . అంత పిచ్చి అది ఏంటో అనుకుంటున్నారా ..? ఇది చదవండి మీకే అర్థమవుతుంది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తారక్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా కోసం భారీ స్థాయిలో కష్టపడుతున్నాడు. ఆర్ ఆర్ ఆర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత తారక్ చేస్తున్న మూవీ ఇదే కావడం గమనార్హం . కాగా రీసెంట్గా తారక్ సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . ఇంటి నుంచి బయటకు వెళ్తే చాలు తన బ్యాగ్ లో కచ్చితంగా బుక్స్ పెట్టుకుంటాడట .

దానికి కారణం ఆయనకు ఎక్కువగా బుక్స్ చదవడమే.. కారులో వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా వేరే ప్రదేశానికి షూటింగ్ కి వెళ్తున్నప్పుడు టైం పాస్ చేయడానికి బోర్ కొట్టకుండా ఉండడానికి బుక్స్ చదవడాని అలవాటు చేసుకున్నారట . ఆ తర్వాత అదే ఆయనకు ఓ వ్యసనంలా మారిపోయిందట. ఇప్పుడు బుక్స్ చదవనిదే తారక్ నిద్ర కూడా పట్టదట..!!