డార్లింగ్ అంటూ ప్రభాస్ స్లాంగ్ ని బీభత్సంగా వాడేసిన స్టార్ హీరోయిన్.. మస్తు షేడ్స్ ఉన్నాయి రా అంటూ కామెంట్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ చివరిసారిగా సలార్ మూవీలో కనిపించాడు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సైతం సంపాదించింది. ఇక ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం చేసిన ప్రభాస్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేశాడు. ప్రస్తుతం కల్కి,ది రాజా సాబ్, స్పిరిట్ మూవీలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇస్మార్ట్ శంకర్ ఫెయిల్ నభా నటేష్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేయడం జరిగింది.

ప్రభాస్ ఎక్కువగా ఉపయోగించే డార్లింగ్ అని పదాన్ని ఎన్నిసార్లు సినిమాలో అయితే వాడారో అదే విధంగా హీరోయిన్ నభా కూడా ఉపయోగించింది. ఈ ప్రభాస్ స్లాంగ్ తో ఉన్న ఈ బ్యూటీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన వారంతా మస్తు షేర్స్ ఉన్నాయి రా అంటూ కామెంట్ చేస్తున్నారు.