అటువంటి ఘనత సాధించిన ఆలియా.. సంతోషంలో ఫ్యాన్స్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా బట్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. తన యాక్టింగ్ మరియు గ్లామర్ తో మొట్టమొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇక నటిగా ఈమె ఎన్నో చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. అలా ఒక్క నేషనల్ వైట్ గానే కాకుండా ఇంటర్నేషనల్ ఎంట్రీ కూడా ఈమె ఇచ్చింది. గత ఏడాదిలోనే హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ మూవీ తో మెరిసిన ఈమె మరో అరుదైన ఘనత అందుకుంది. ప్రపంచ ప్రఖ్యత మ్యాగ్జైన్ అయినటువంటి టైమ్స్ 100 లో భారత్ నుంచి ఏకైక నటిగా చోటు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

దీంతో మరోసారి ఇండియా వైడ్ గా ఈమె పేరు వైరల్ గా మారింది. అయితే సినిమా పరంగా ఈమె పేరు సహా మరికొన్ని విభాగాల్లో మరికొందరు భారతీయులు ఈ టాప్ 100 లో స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ అజయ్ బంగా, అలాగే నటుడు మరియు దర్శకుడు దేవ్ పటేల్ , సాక్షి మల్లిక్ అలాగే తదితరులు ఈ లిస్టులో నిలిచారు.