చేసింది ఒకే ఒక్క సినిమా.. కానీ స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ ఆమె సొంతం.. ఇంతకీ ఎవరు ఆమె..?

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఆ సినిమాతోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన హీరోయిన్ రితిక నాయక్. మొదటి సినిమాతోనే తన అందం మరియు అభినయంతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.

ఇంతకీ ఏంటా మొదటి సినిమా అనుకుంటున్నారా? అదేనండి విశ్వక్సేన్ హీరోగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం. తొలిసారి ఈ అమ్మడు తెలుగు సినీ పరిశ్రమలోకి విశ్వక్సేన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తమిళ్లో కూడా అవకాశాలు అందుకుంది. రితిక టాలీవుడ్ అండ్ హాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా అవకాశాలు అందుకుంది అనే టాక్ ఇండస్ట్రీలో బాగా నడుస్తుంది. ఈమె ఢిల్లీకి చెందిన మోడల్. గ్రాడ్యుయేషన్ అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె మంచి గుర్తింపును పొందింది.

అటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ నిత్యం న్యూ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. చేసింది ఒకే సినిమా అయినప్పటికీ ఏదో 100 సినిమాలు చేసినంత పాపులారిటీ సంపాదించుకుంది ఈ భామ. ప్రస్తుతం ఈమె గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈమె ఎక్కడ పుట్టింది మరియు ఎక్కడ పెరిగింది అనే మరిన్ని వార్తలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.