ఏకంగా 200 మంది మధ్యలో చిరంజీవి పరువు తీసేసిన నిర్మాత.. నువ్వేమన్నా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అంటూ కామెంట్స్..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన టాలెంట్ను నిరూపించుకుని ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు చిరు. ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా తన కష్టంతో పైకి ఎదిగాడు. దాదాపు నాలుగు దశాబ్దాలు టాలీవుడ్ సింహాసనాన్ని ఏలారు. ఆరుపదుల వయసు దాటిన ఏమాత్రం జోరు తగ్గించకుండా తన నటనతో దూసుకెళ్తున్నాడు.

ఇక ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిత్యం చిన్న హీరోల సినిమాలను ప్రమోట్ చేసేందుకు ముందుంటాడు. కొత్త కొత్త నటీనటులను ప్రోత్సహిస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నాడు. ఇక తాజాగా చిరంజీవి డిజిటల్ క్రియేటర్స్ బీట్కు ప్రత్యేక అతిథిగా విచ్చేశాడు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత కెరీర్ గురించి మాట్లాడారు. ఇక ఈ మీట్ కి విజయ్ దేవరకొండ కూడా పాల్గొని చిరంజీవి వ్యక్తిగత జీవితాల పై కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇక‌ ఈ క్రమంలోనే చిరంజీవిని మీ వ్యక్తిగత కెరీర్ గురించి చెప్పండి అని ప్రశ్నించగా..” న్యాయం కావాలి సినిమా షూటింగ్ జరుగుతుంది.

రాధిక శారద జగ్గయ్య వంటి పెద్ద వారితో కోర్టు సీన్ చేయాల్సి ఉంది. అప్పుడు నిర్మాత క్రాంతి కుమార్ రోప్ తో మీద ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి షూట్ రెడీ అయిందని చెప్పడంతో నేను వెళ్లి బోన్ లో నిలిచాను. దీంతో ఇంత లేటుగా వచ్చావని నిర్మాత అందరూ ముందు అరిచారు. ప్రియమైన పెద్ద సూపర్ స్టార్ అనుకున్నావా నీకోసం.. ఇంతమంది వెయిట్ చేయాలా అని అందరి ముందు గట్టిగా కేకలు వేశారు. దాదాపు 200 జూనియర్ ఆర్టిస్ట్ ల ముందు నాకు ఈ ఇన్సిడెంట్ ఎదురైంది ” అంటూ చెప్పుకొచ్చాడు చిరు.